''ఎరగకనమ్మిన వారి నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
డోన్ట్ కేర్''
అంటూ సాగే ఆత్రేయగీతం ఎంతో పాప్యులర్ అనే సంగతి మనకు తెలుసు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, అక్కడ ఫిరాయింపు పర్వాలకు అతికినట్లుగా సరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరిన వైనం, ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం, అందులో వల్లించిన నీతులు అన్నీ ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తాయి. బయటకు వచ్చే అందరు నాయకులు వదిలిపెట్టిన పార్టీ మీద రాళ్లు వేసినట్లుగానే ఎంతో సీనియర్ అయిన జ్యోతుల కూడా వ్యవహరించారు. ఆయన కూడా అదే తీరుగా జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు.
అందరూ సున్నా అనుకునే జగన్ లాంటి నాయకుడిని ఎంత త్వరగా వీడి బయటకు వస్తే అంత మంచిదని అనుకున్నారుట. అలాంటి వ్యక్తి అసలు పార్టీకి నాయకుడుగా ప్రజలకు ఏమాత్రం పనికిరారుట. రాష్ట్రంకోసం శ్రమిస్తున్న చంద్రబాబు పిలుపును అందుకోకపోతే.. ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుందిట.. ఇలాంటి అనేక రకాల రుచికరమైన వాక్యాలను ఆయన తన ప్రసంగంలో వండి వార్చారు.
అంతా బాగానే ఉంది. మరి జగన్ వైఖరి మరియు చంద్రబాబు పడే కష్టం మీద అంత క్లారిటీ వచ్చిన ఇంత సీనియర్ నాయకుడు జ్యోతుల రెండేళ్లపాటూ ఆ కోటరీలో ఉండే.. తెదేపా మీద విరుచుకుపడుతూ ఏం చేసినట్లు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నియామకం పూర్తయ్యే వరకు ఎందుకు ఎదురుచూస్తూ కూర్చున్నట్లు? ఇవన్నీ మిలియన్ డాలర్ ప్రశ్నలు.
అలాగే... తన నియోజకవర్గ పరిధిలోని వైకాపా జడ్పీటీసీలు - ఎంపీపీలు - 43 మంది ఎంపీటీసీలు - 36 మంది సర్పంచులు - 4గురు పీఏసీఎస్ అధ్యక్షులను కూడా ఆయన తెదేపాలోకి తీసుకువెళ్లి ఇదీ తన బలం అంటూ టముకేసుకున్నారు. అయితే అది ఆయన బలం ఎలా అవుతుంది. ప్రాక్టికల్ గా మాట్లాడితే.. ఇంకా ప్రతిరోజూ ఉదయం ఎన్టీఆర్ ఫోటోచూసి దినచర్య ప్రారంభిస్తా అని చెప్పుకునే ఈ నాయకుడు.. అంత విలువలు పాటించే వారైతే.. వైకాపా తనకు కట్టబెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి తెదేపాలోకి వెళ్లాలి. అలాగే తనకు దమ్ముంటే గనుక.. తన వెంటవచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులంతా వైకాపా యొక్క ఆస్తి అనే సంగతిని గుర్తించి వారితో రాజీనామా చేయించి.. ఆ తరువాత తెదేపాలోకి తీసుకువెళ్లాలి. అలాంటి ఆఫర్ చేసి ఉంటే..అప్పుడు అసలు ఆయన వెంట బలగంలాగా ఎందరు వచ్చేవారో తేటతెల్లం అయ్యేది. అందుకే మిగిలిన ఎమ్మెల్యేల కంటె.. జ్యోతుల తెదేపాలో చేరిన తీరు కంటగింపుగా ఉన్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.