తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ చూడని సీన్ ఒకటి ఇపుడు అంతా చూస్తున్నారు. పార్టీని పట్టుకుని దశాబ్దాలుగా పాతుకుపోయిన బిగ్ షాట్స్ కి ఇపుడు గట్టి షాక్ తగులుతోంది. అది కూడా చంద్రబాబు వంటి వారే చేయడం విశేషం. చంద్రబాబు రాయలసీమ జిల్లాల టూర్ కాదు కానీ కొందరు బడా నేతలకు హ్యాండ్ ఇచ్చేశారు. ఉమ్మడి కర్నూల్ జిల్లా డోన్ అభ్యర్ధిగా లోకల్ లీడర్ సుబ్బారెడ్డిని ప్రకటించి ఏళ్ళకు ఏళ్ళు టీడీపీలో ఉన్న కేఈ క్రిష్ణమూర్తి ఫ్యామిలీకి గట్టి షాక్ ఇచ్చేశారు.
డోన్ అంటే కేఈ ఫ్యామిలీనే కనిపిస్తుంది, వినిపిస్తుంది. 1978లో చంద్రబాబు, వైఎస్సార్ లతో పాటే రాజకీయ ఎంట్రీ ఇచ్చిన కేఈ క్రిష్ణమూర్తి ఫస్ట్ డోన్ నుంచే గెలిచారు. అప్పటికి అది అగ్ర వర్ణాల చేతులలో ఉంది. నాడు బీసీ నినాదంతో కేఈ గెలుపొందారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. 1985 నుంచి చూసుకుంటే కేఈ ఫ్యామిలీ చేతులలోనే డోన్ ఉంటూ వచ్చింది.
అంతదాకా ఎందుకు గడచిన 2019 ఎన్నికల్లో కూడా కేఈ క్రిష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ అక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే ఈసారి మాత్రం బాబు ఆయనకు సీటు ఇవ్వనని మొహమాటామే లేదని కూడా చెప్పేశారు. జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తూ కొన్ని నియోజకవర్గాలలో తమ వారినే ఎపుడూ గెలిపించుకుంటూ వస్తున్న కేఈ ఫ్యామిలీకి ఇలా ఝలక్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు.
ఇక కొంతకాలంగా కేఈ ఫ్యామిలీ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటోంది. ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లఒ కూడా సుబ్బారెడ్డి అంతా తన భుజానేసుకుని తిరిగారు. దాంతో చంద్రబాబు ఆయన్ని గుర్తించి మీకే టికెట్ అని క్యాడర్ సాక్షిగా చెప్పేశారు. ఇక సభలోనూ ఆయన్ని పక్కన పెట్టుకుని తిరిగారు. ఇక బాబు కర్నూల్ జిల్లా టూర్ కి కేఈ ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉండడం విశేషం.
పార్టీకి వారు రాజీనామా చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్నా ఏ పార్టీలో చేరుతారు అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు అంటే ఇన్నాళ్ళూ మాటల మనిషే అని అంతా భావించేవారు. ఆయన ఇన్నాళ్ళకు చేతలకు దిగుతున్నారు. తాను చెప్పినట్లుగానే పనిమంతులకే టికెట్లు అని చెబుతూ వాటిని అమలులో పెడుతున్నరు. మరి ఇదే తీరున బాబు దూకుడు ఉంటే టీడీపీలో బిగ్ షాట్స్ కి సీనియర్ తమ్ముళ్ళకూ ఎదురుగాలులే అంటున్నారు. మొత్తానికి బాబు మారారు. తమ్ముళ్ళు మారుతారా. లేక పార్టీ మారుతారా. వెయిట్ అండ్ సీ.