ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కోపం వచ్చింది. మీడియాలో మెగాస్టార్ చిరంజీవి మనమరాలు పుట్టిన సందర్భంగా మీడియా హడావుడి చేసిన తీరుపై ఆయన చిరాకు పడ్డారు. హడావుడి చేసిన మీడియా కన్నా.. అందుకు కారణమైన చిరంజీవి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవికి మనమరాలు పుడితే అది న్యూసా? ఆయన తుమ్మితే అది న్యూస్.. ఆయన దగ్గితే అది న్యూస్.. అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడిన ఆయ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఎప్పటిలా మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కేసీఆర్.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన మాటల్ని యధాతధంగా చదివితే.. ''2008లో చిరంజీవి పార్టీ పెట్టి.. 2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రూ.1500కోట్లు పార్టీ ఎమ్మెల్యే టికెట్ల కొనుక్కొని నష్టపోయారు. మీకేం? మహారాజులా ఉన్నారు. మనమరాలు పుడితే అది న్యూస్. నువ్వు తుమ్మితే అది న్యూస్. నువ్వు దగ్గితే అది న్యూస్. నువ్వు ఎంపీవై.. మినిస్టర్ అయ్యావు. మా బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. కాపులు ఏమయ్యారు? అడుక్కుతింటున్నారు'' అని అన్నారు.
బీసీలు.. కాపులంతా ఏకం కావాలన్న అభిలాషను వ్యక్తం చేసిన కేఏ పాల్.. ''ఏయ్ బీసీల్లారా.. కాపుల్లారా.. అసలైన కాపును నేనున్నా. ప్రపంచాన్ని శాసించి.. గెలిచి.. దేవుడు పంపగా.. మీ ముందుకు వచ్చా. ధర్మవరం సెంటర్లో టీ తాగటానికి ఆగితే.. నాకు నిజంగా ఆశ్చర్యమైంది. వందల మంది.. ఒక్కరికి నేను టీలు ఇవ్వలా. వాళ్లే.. టీలు.. కాఫీలు.. స్వీట్లు..సెల్ఫీలు తీసుకున్నారు. మాకు కేతిరెడ్డి వద్దు.. చంద్రబాబు నాయుడు వద్దు. మనకుబడుగు బలహీన వర్గాల నాయకుడైన కేఏ పాల్ రావాలి.
ప్రజాశాంతి జిందాబాద్ అన్న నినాదాలు చూశారా మీరు?'' అంటూ ప్రశ్నించారు. తనకు రాయలసీమలో ఫాలోయింగ్ తక్కువని భావించానని.. కానీ ధర్మవరం సెంటర్లో అక్కడి వారు ప్రదర్శించిన అభిమానానికి ముగ్దుడ్ని అయ్యానన్న ఆయన.. కులాల లెక్కలు చెప్పి అధికారం వారి చేతుల్లోనే ఎందుకు ఉండలంటూ ప్రశ్నించారు.''రాయలసీమలో నాకు ఫాలోయింగ్ తక్కువ అనుకున్నా.
ఇక్కడ చూసిన తర్వాత..నేను షాక్ అయ్యా. పవన్ కల్యాణ్ పార్టీ పదిహేను సీట్లకు అమ్ముడుపోయిదంటే.. ఎంత విచారం? మూడు శాతం ఉన్న కమ్మోళ్లు ఏలాలా? ఐదు శాతం ఉన్న రెడ్లే ఏలాలా? ఒక శాతం ఉన్న దొరలు ఏలాలా? బీసీల్లారా.. ఎస్సీల్లారా.. ఎస్టీల్లారా రండి.. కలిసి రండి.. కలిసి పోరాడదాం. ప్రజాశాంతి పార్టీని175 సీట్లు గెలిపించండి. ఇప్పుడున్న రెండు పార్టీలను అడ్రస్ లేకుండా చేయండి'' అని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీని మూసేసి.. తమ ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని.. లేకుంటే చరిత్ర హీనుడిగా మారతారని శపించిన ఆయన.. ఇంకేమన్నారంటే.. ''పవన్ కల్యాణ్ పార్టీని మూసేసుకొని.. ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయ్. లేదంటే.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు. సత్తా ఉంటే ఎన్టీఆర్.. జయలలిత.. ఎంజీఆర్ లా.. ఒంటరిగా పోటీ చేయ్. ఎంతోమంది నటీమణులు ఒంటరిగా పోటీ చేసి.. అత్యధిక మెజార్టీతో ఎంపీలుగా గెలిచారు.
నీకు సిగ్గులేదా? నాకు ఓట్లు వేయమని టీడీపీ కార్యకర్తల్ని అడుక్కుంటావా? అధికారం లేకుండా రూ.5లక్షల కోట్లు తెచ్చా. అధికారం ఉంటే రూ.50లక్షల కోట్లు తేగలను. తన్నుకుంటే.. అడుక్కుంటే.. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు డబ్బులిచ్చా. నా డబ్బులన్ని మూసేసి.. అడుగడుగునా నన్ను అడ్డుకుంటుంటే.. సింగిల్ గా సింగిల్ వెహికిల్ లో వెళుతున్నా. ఇంకేం చెబుతాం'' అంటూ ముక్తాయించారు.