ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీని నిజంగానే ఓ ఆట ఆడేసుకుంటోంది. తొలి సెషన్ రెండో రోజే ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటే... నాలుగో రోజైన సోమవారం నాటికే టీడీపీపై వైసీపీ పైచేయి సాధించేసింది. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న పలు అక్రమాలను ప్రస్తావిస్తున్న వైసీపీ సభ్యులు... ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశాల్లో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి వైసీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి... చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న చాలా అంశాలను ప్రస్తావించిన కాకాణి... టీడీపీ నుంచి అసలు ప్రతిఘటనే ఎదురుకానంతగా చెలరేగిపోయారు. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఏ ఒక్కదానిని కూడా అమలు చేయని చంద్రబాబు... సరిగ్గా 2019 ఎన్నికలు ముంచుకువచ్చినప్పుడే వాటికి బూజు దులిపారని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో ఎన్నికల ముంగిట మహిళల ఓట్లను గంపగుత్తగా లాగేసేందుకు చంద్రబాబు సర్కారు డ్వాక్రా మహిళలకు ప్రకటించిన పసుపు కుంకుమను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాకాణి చాలా సెటైరికల్ గా సంధించిన ప్రశ్నలకు టీడీపీ శిబిరం నుంచి ఆన్సర్లే రాలేకపోయాయి. అయినా టీడీపీని నోకెత్తకుండా చేస్తూ కాకాణి ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే... ఆడపడచులకు పపుసు కుంకుమ పెట్టడం ఆనవాయితీనేని చెప్పారు. పసుపు కుంకుమతో పాటు చీర సారె కూడా పెడతామని, అది హిందూ సంప్రదాయమని కూడా కాకాణి చెప్పారు. అయితే అనాదిగా సాగుతూ వస్తున్న ఈ సంప్రదాయానికి చంద్రబాబు తూట్లు పొడిచారని తనదైన శైలి కామెంట్ చేశారు. ఎక్కడైనా పసుపు, కుంకుమ, చీర, సారె... అన్నీ ఒకేసారి పెడతారన్న విషయాన్ని కూడా కాకాణి గుర్తు చేశారు. అందుకు విరద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు... పసుపును ఒక సారి, కుంకుమను మరోసారి ఇస్తామన్నట్లుగా పసుపు కుంకుమను విడతలవారీగా విడుదల చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు.
పసుపు, కుంకుమను ఎక్కడైనా విడివిడిగా పెడతారా? అని ప్రశ్నించిన కాకాణి... బాబు జమానాలో మాత్రం అది సాధ్యమైందని కూడా ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించిన కాకాణి... తన నియోజకవర్గంలో జరిగిన ఓ హత్యను ప్రస్తావించారు. టీడీపీకి చెందిన ఓ గ్రామ స్థాయి నేత భార్య చేతిలోనే చనిపో్తే... ఆయన వైసీపీ నేతల దాడుల్లో చనిపోయారని చంద్రబాబు చెప్పారని, సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని సదరు టీడీపీ నేతను కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి చంపేస్తే... ఆ హత్యను తమకు ఆపాదిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తను టీడీపీ అనుకూల మీడియాలోనే వచ్చిందంటూ ఆయన పలు పత్రికల కథనాలను సభలో చూపారు. మొత్తంగా పసుపు కుంకుమను విడివిడిగా పెడతారా? అంటూ కాకాణి సంధించిన సెటైర్ తో టీడీపీ నేతల నోట మాటే రాలేదు.