కాక.. నూ సూపరో సూపరు..జనాలకు కాకినాడ కమిషనర్ అదిరిపోయే 'రిటర్న్ గిఫ్ట్ 'లు
ఒక వైపు కరోనా విజృంభిస్తోంది. సీజనల్ డెంగ్యూ, మలేరియా కరోనాకు తక్కువేమీ కాదంటూ.. అవి కూడా మాదిరిగానే ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిశుభ్రత పాటించాలని ఇళ్లను శుభ్రపరచుకోవడంతో పాటు ఇంట్లోని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని అధికారులు రోజూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకో, లేకుంటే చెత్త కుండీలోనో వెయ్యాలని సూచిస్తున్న జనాలకు అవేమీ పట్టడం లేదు. ఎప్పటిలాగే జనం చెత్తను రోడ్లపై పడేసి వెళ్తున్నారు. ఇది చూసిన కాకినాడ మున్సిపల్ కమిషనర్ కు మండి పోయింది. దీంతో ఆయన అలా రోడ్ల మీద చెత్త పడేస్తున్న వారికి 'రిటర్న్ గిఫ్ట్ 'లు ఇవ్వడం మొదలు పెట్టాడు.
గిఫ్ట్ లు ఏంటీ అనుకుంటున్నారా.. ఎవరైతే చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై పడవేసి వెళతారో.. ఆ చెత్తను తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందే పడేయడం మొదలుపెట్టాడు. ఈ 'రిటర్న్ గిఫ్ట్ ' ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కాకినాడ కమిషనర్ చేస్తున్న పనికి ప్రశంసిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా స్వప్నిల్ దినకర్ పనిచేస్తున్నారు. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ చెత్త ఆయన అధికారులతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా సరే జనంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. వీధుల్లో పర్యటించిన ప్రతిసారి రోడ్లపైనే చెత్త కనిపించేది. దీంతో జనాలకు అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్న కమిషనర్ నగరంలోని శాంతినగర్ లో తనిఖీలు చేయడానికి వెళ్లారు.
ఆ సమయంలో రోడ్డు పైకి వచ్చిన ఓ మహిళ అక్కడే చెత్త పడవేసి వెళ్ళి పోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే ఆమె పడేసిన చెత్తను తీసుకున్న ఆయన ఆమె వెనకాలే వారి ఇంటి వద్దకు వెళ్లి వారి ఇంటి ముందు చెత్త పడేశారు. ఇప్పుడెలా ఉంది.. బాగుందా.. అంటూ ఆమెను ప్రశ్నించాడు. మరోసారి ఇలా చెత్త రోడ్డుపై పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆమెకే కాదు ఆ చుట్టుపక్కల వారికి కూడా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా రోడ్డుపై చెత్త ఎవరు పడేసినా 'రిటర్న్ గిఫ్ట్ ' అందడం ఖాయమని హెచ్చరించారు. ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికుడికో, లేదంటే సమీపంలోనే చెత్త కుండీలోనో వ్యర్థాలను పడేయాలని సూచించారు. కాగా కాకినాడ కమిషన్ చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.