ఆర్థిక పరమైన నేరాల్లో వినిపిస్తున్న పేరు కల్కీ భగవాన్. గతంలోనూ ఆయన ఆశ్రయంపై చాలా ఆరోపణలున్నాయి. అయితే అలాంటి వ్యవహారాలు మొదట వెలుగులోకి రావడం, ఆ తర్వాత తెరమరుగు కావడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం కల్కీ భగవాన్ ఆశ్రమాలు డీప్ ట్రబుల్స్ లో పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక మొన్నటి వరకూ భగవాన్ గా తనను తాను చెప్పుకున్న కల్కీ భగవాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఆస్తుల చిట్టా కూడా భారీ స్థాయిలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన కోట్ల రూపాయల మేర అక్రమ సంపదనే పెట్టుకున్నారని టాక్.
అందుకు సంబంధించి విచారణలు జరగాల్సి ఉంది. ఆయన ఆశ్రమం పై ఆర్థిక సంస్థల తనిఖీల్లో భారీగా డబ్బులు పట్టుబడ్డట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో టాక్ కూడా మొదలైంది. ఆయన భారీ ఎత్తున తన డబ్బులను సినిమా ఇండస్ట్రీపై ఇన్వెస్ట్ చేశారనే ప్రచారం సాగుతూ ఉంది. డబ్బులు ఎక్కడ పెట్టాలో అర్థం గాక కొంతమంది నిర్మాతలకు ఆయన ఫైనాన్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఇండస్ట్రీ అంటే అంతా కోట్ల రూపాయలతో వ్యవహారం. అలాంటి పరిశ్రమలోకి డబ్బులు పెట్టుబడిగా పెట్టారంటే సదరు వ్యక్తి ఆర్థిక శక్తి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. చాలా మంది భక్తులు స్వామీజీలకు నల్లధనాన్ని కానుకలుగా, విరాళాలకు ఇస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఆ డబ్బులను విరాళాలుగా చూపడం స్వామీజీలకు కూడా ఇష్టం ఉన్నట్టుగా లేదు.
వారు కూడా దాన్ని బ్లాక్ మనీగానే వ్యవహరిస్తూ.. అక్రమ మార్గాల ద్వారా వేర్వేరు వ్యాపారాల్లోకి తరలిస్తూ ఉంటారంటారు. అలాంటి వారిలో కల్కీ భగవాన్ కూడా ఒకరనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి గుట్టు బయటపడాల్సి ఉంది. కల్కీ భగవాన్ ఎవరి ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాడనే విషయంపై పూర్తి విచారణ జరగాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.