'బబుల్ టీ' బిజినెస్ తో బిలియనీర్... ఎవరీ యునాన్ వాంగ్?

అయితే... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ "బబుల్ టీ" బిజినెస్.

Update: 2025-02-13 19:30 GMT

సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి, బిజినెస్ మోడల్ గురించి దాదాపు చాలా మందికి తెలిసిందే. అయితే... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ "బబుల్ టీ" బిజినెస్. ప్రధానంగా... ఈ బబుల్ టీ వ్యాపారం చేసి తాజాగా 38 ఏళ్ల యునాన్ వాంగ్ చైనాలో బిలియనీర్ అయిపోయారు. దీంతో.. ఈ బిజినెస్ పై పెద్ద చర్చ మొదలైంది.

అవును... ఫోర్బ్స్ నివేదిక ప్రకారం యునాన్ వాంగ్ సంస్థ "మింగ్ హోల్డింగ్స్" ఐపీవోకి వెళ్లింది. ఈ సమయంలో అదరగొట్టేలా 233 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో.. యునాన్ వాంగ్ నికర విలువ 1.2 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా.. యువాన్ చైనా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఇతని సంస్థ "గుడ్ మీ" పేరుతో బబుల్ టీని విక్రయిస్తుంది.

యునాన్ వాంగ్ తల్లితండ్రులు మయన్మార్ సరిహద్దుల్లో చిన్న రిటైల్ బిజినెస్ ను నిర్వహిస్తున్నారు. అయితే.. వాంగ్ 2010లో జెజియాంగ్ సైన్స్ - టెక్ యూనివర్శిటీ నుంచి మెటీరియల్ సైన్స్, ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ ఏడాది తన స్వస్థలమైన డాక్సీలో బబుల్ టీ షాపును ప్రారంభించాడు. ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఈ క్రమలో రోజూ ఈ టీ అమ్మకాల ద్వారా 100 యువాన్లు (దాదాపు రూ.1180) మాత్రమే అమ్మకాలు జరిగేవి. ఈ సమయంలో పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన వాంగ్ తన సహ వ్యవస్థాకుడి కూల్ డ్రింక్ ను అమ్మేవారు. అయితే... రోజులు గడిచే కొద్దీ వాంగ్ అమ్మే బబుల్ టీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు.. షాపుకు కస్టమర్ల తాకిడి ఎక్కువైంది.

ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చైనా వ్యాప్తంగా మొత్తం పదివేల బబుల్ టీ ఫ్రాంచైజీలతో ఇప్పుడు వ్యాపారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు యునాన్!

ఏమిటీ బబుల్ టీ?:

బోబా టీనే బబుల్ టీగా అవతరించిందని చెబుతారు. వాస్తవానికి 1980లలో తైవాన్ లో పుట్టిన బబుల్ టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుర్రకారుకు యమక్రేజ్ అని చెబుతారు. ఈ టీని.. చల్లని పాలు, పండ్ల రసాలు, టాపియోకా, జెల్లీ ముక్కలతో తయారు చేస్తారు. ఇది ప్రధానంగా చైనా, తైవనా, ఇతర ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందింది.

ఇప్పుడు ఈ బబుల్ టీ అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... హైదరాబాద్, వైజాగ్, విజయవాడల్లో రకరకాల ఫ్లేవర్స్ తో బబుల్ టీ దొరుకుతుంది.

Tags:    

Similar News