తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా చెప్పిన మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసేందుకు విపరీతంగా శ్రమించే ఆమె.. ఎప్పుడూ బయటకు రాని ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. బతుకమ్మను ఫేమస్ చేసే విషయంలో తానెంత కష్టపడ్డది చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను బతుకమ్మ ఉత్సవాల్ని నిర్వహించటానికి తన నగల్ని తాకట్టు పెట్టి మరీ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా చెప్పుకొచ్చారు. అక్టోబరు 12 నుంచి 20 వరకు బతుకమ్మను నిర్వహిస్తామని చెప్పిన ఆమె.. గతంలో తన మీద ఆరోపణలు చేశారని.. అలాంటివేమీ పట్టించుకోకుండా తాను సాగినట్లు చెప్పుకొచ్చారు.
తాను బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంటే.. తాను విరాళాలు వసూలు చేసినట్లు విమర్శలు చేశారని.. కానీ.. బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించటం కోసం తాను తన నగల్ని తాకట్టు పెట్టి ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు. బతుకమ్మ కోసం తానెంత కష్టపడిందని తాజాగా వెల్లడించిన విషయాన్ని కవిత ఇప్పటివరకూ చెప్పకపోవటం గమనార్హం. బతుకమ్మ పండగ నిర్వహణ కోసం కవితక్క అన్ని కష్టాలు పడ్డారా..?