బీజేపీ వ్యతిరేకంగా కమల్ హాసన్ అడుగులు

Update: 2021-08-04 05:30 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మళ్లీ యాక్టివ్ అయిపోయారు. తన భవిష్యత్ ప్రణాళికలపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా.. నీతిగా నిజాయితీ పాలిటిక్స్ అంటూ వెళ్లిన కమల్ కు ఘోర ఓటమి ఎదురైంది. పారదర్శక పార్టీగా మాత్రం కమల్ ఘనత పొందారు. ఇప్పుడు కమల్ ఈ గుణపాఠంతో ఆచితూచి రాజకీయ అడుగులు వేస్తున్నారు.

కమల్ కు రాజకీయ అనుభవం తక్కువ. ఈ క్రమంలోనే ఈ కీలక వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వీరే ముఖ్యమైన సూచనలు, ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించే బాధ్యతను కమల్ అప్పగించినట్టు సమాచారం. వెల్దైస్వామి పార్టీలో కీరోల్ గా మారుతాడని కమల్ అభిప్రాయపడ్డారు.త్వరలోనే మరిన్ని నియామకాలు, పార్టీ ప్రక్షాళన చేపడుతానని కమల్ హాసన్ తెలిపారు.

ఇక కమల్ హాసన్ రాజకీయంగా కీల అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీలతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని కమల్ హాసన్ ప్రకటించారు. ఆ పార్టీలు ఆహ్వానిస్తే వారితో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు.

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటైతే అందులో చేరుతారా? అన్న ప్రశ్నకు కమల్ హాసన్ బదులిచ్చారు. పెగాసస్ వ్యవహారంపైనా స్పందించిన కమల్ హాసన్.. వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడవద్దని తెలిపారు.

కమల్ హాసన్ ఆది నుంచి బీజేపీని, హిందుత్వను వ్యతిరేకిస్తూ సెక్యూలర్ వాది రాజకీయాలు చేస్తున్నారు.కాంగ్రెస్ ది కూడా సెక్యులరిజం కావడంతో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతుగా కమల్ హాసన్ పార్టీ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా కమల్ హాసన్ పార్టీని అక్కున చేర్చుకోవాలని చూస్తోంది. అయితే కమల్ ను ఆహ్వానించినా కూడా చేర్చుకోవడం బాధ్యత డీఎంకే అధిష్టానానికే ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. దీంతో డీఎంకే -కాంగ్రెస్ మధ్య కూటమిలో డీఎంకే ఏం నిర్ణయిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.

మొత్తం మీద కమల్ హాసన్ చేతులు కాలాక ఇప్పుడు పార్టీని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. దశల వారీగా పార్టీని నిర్మించేలా చూస్తున్నారు.


Tags:    

Similar News