వచ్చే ఎన్నికల్లో పోటీకి కమల్ సై..

Update: 2018-12-22 11:02 GMT
నటుడు, ప్రస్తుతం పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లోకి దూసుకొచ్చిన కమల్ హాసన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల పై తన ఆసక్తిని ప్రదర్శించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ మాట్లాడుతూ.. తమ పార్టీతో భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీచేసే అవకాశాలున్నాయని చెప్పారు. రాజకీయంగా రంగులు మార్చే పార్టీలతో తాను జట్టు కట్టనని చెప్పారు.

ఇటీవల తమిళనాడులో పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడ్డా దృష్టా  ఆ 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ పోటీచేస్తుందని  కమల్ హాసన్ ప్రకటించారు. పొత్తు నిర్ణయాలను పూర్తిగా తనకు ఇస్తూ మక్కల్ నీది మయ్యం నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారని కమల్ హాసన్ వివరించారు.. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని.. తమతో కలిసి వచ్చే పక్షాలను స్వాగతిస్తామని కమల్ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కమల్ ఇప్పటివరకు ఎన్నికల్లో పరీక్షించుకోలేదు. త్వరలోనే జరిగే   పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గెలుస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News