విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ..ఏపీకి మరో మణిహారం. ఇటీవల నిర్వహించిన టెస్ట్ రన్ కూడా విజయవంతం కావడంతో ఈ నెల 4న ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే , అనూహ్యంగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంబ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 4న ఈ ఫ్లైఓవర్ ను కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ కరోనా కారణంగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించాల్సి ఉంది. అంతకు ముందే ఈ ప్లైఓవర్ విశిష్టతను దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పేలా కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది.
కానీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకస్మిక మృతితో కనకదుర్గ ఫ్లైఓవర్ కార్యక్రమం వాయిదా పడింది. ప్రణబ్ మృతికి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలూ నిర్వహించరు. దీంతో సహజంగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న నగర వాసులు కొంత నిరాశకి లోనైయ్యారు. ప్రణబ్ మృతికి సంతాపంగా వారం రోజుల పాటు అధికారిక కార్యక్రమాలేవీ జరిగే అవకాశం లేకపోవడంతో ఈ వారం ముగిశాక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కొత్త తేదీని కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ఆ మేరకు మళ్లీ అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ నెల రెండో వారంలో ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉంది.