తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రొఫెసర్ కంచె ఐలయ్య సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన ఇందిరా భవన్ లో విద్య, ఉపాధిపై ప్రభుత్వ వాగ్దానాలు-వైఫల్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ పాలనను విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసేందుకు సహకరించాలని..చంద్రబాబు పై ఏ కేసు పెట్టినా ఒప్పుకోవాలని కోరుతూ కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కాళ్లు పట్టుకుని మరీ వేడుకున్నారని ఐలయ్య ఆరోపించారు.
ఇంకా కేసీఆర్ ను ఆయన విమర్శిస్తూ తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ తన సొంత సిలబస్ ను అమలు చేస్తున్నారని...తెలంగాణ ఏర్పాటుఅయ్యాక ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియాగాంధీతో ఫొటో ఎందుకు దిగారని ప్రశ్నించారు. కేసీఆర్ తన సొంత ఎజెండాను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ గా చేరుస్తున్నారని...తెలంగాణ ఇచ్చిన వారి పాఠ్యాంశాలు కూడా సిలబస్‌లో చేర్చాలి కదా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని..కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.
ప్రొఫెసర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవని... 22 వేల పాఠశాలల్లలో విద్యార్థులకు తాగునీరు లేదని...12 వేల పాఠశాలల్లో టాయిలెట్లు లేవని...యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు కూడా లేని స్థాయికి విద్యావ్యవస్థ దిగజారిందని ఆయన వాపోయారు.
మరో ప్రొఫెసర్ భాగ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణలో 38 శాతం విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారని..తెలంగాణలో విద్యావ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కేసీఆర్ పై ఐలయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం రేపాయి.