అమిత్ షాను చంపేందుకు బాబు కుట్ర

Update: 2018-06-12 07:06 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లో  బీజేపీని  విలన్ ను చేయడానికి కంకణం కట్టుకున్నాడని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడం కలకలం రేపింది. అంతేకాదు.. కేంద్రం ఏపీ ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నా.. ఇవ్వడం లేదంటూ మోసం చేస్తున్నాడని కన్నా తీవ్ర ఆరోపణలు చేశాడు.

‘చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు. దుష్ట రాజకీయాలు చేస్తున్నారు. తనకున్న పలుకుబడితో మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు’ అంటూ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో కన్నా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ మధ్య ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేశాడంటూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసి నానా విమర్శలు చేసిన చంద్రబాబు వైఖరికి నిరసనగా కన్నాతో పాటు బీజేపీ నేతలు విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ‘దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా కేంద్రం నిధులు ఇస్తోందని.. ఏపీకి నిధులు వస్తున్నా ప్రధానిని కావాలనే చంద్రబాబు అభాసుపాలు చేస్తున్నాడని ’ విమర్శించారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడే అని.. ఈ విషయాన్ని గత నాలుగేళ్ల పాలన చూస్తే అందరికీ అర్థమవుతుందని’ కన్నా పేర్కొన్నాడు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం చేతకాని చంద్రబాబు.. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని ధ్వజమెత్తారు.

అంతేకాదు గత ఏప్రిల్ నుంచి బీజేపీ ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల ఆరోపణలను కన్నా తీవ్రంగా ఖండించారు.  అంతేకాదు చంద్రబాబు చేసిన కుట్రను కూడా  బయటపెట్టాడు. ఈ మధ్య తిరుమలను కుటుంబ సభ్యులతో దర్శించుకోవడానికి వచ్చిన అమిత్ షాను హత్య చేయించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశాడు. ‘చంద్రబాబు, ఆయన మంత్రి వర్గ సహచరులు కలిసి ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసి పరువు తీస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు మౌనంగా ఉండడంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. అందుకే ఏకంగా అమిత్ షాపై తిరుమలలో దాడి చేసి హత్య చేయించేందుకు కుట్ర జరిగింది’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడీ విమర్శలు ఏపీలో దుమారం రేపాయి. అమిత్ షా హత్యకు బాబు కుట్రపన్నాడని ఆరోపించడం ద్వారా టీడీపీని డిఫెన్స్ లో పడేశాడు కన్నా. ఇన్నాళ్లు దూకుడుగా ముందుకు వెళుతున్న టీడీపీ నేతలపై అంతే దూకుడుగా స్పందిస్తున్నాడు కన్నా. బీజేపీ చీఫ్ అమిత్ షా - ప్రధాని మోడీ తోడ్పాటుతో కన్నా చెలరేగి పోతుండడం చూసి టీడీపీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News