తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి ఇప్పుడు హాట్ సీటు. ఇక్కడ ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు ఏరికోరి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలోకి దించి సెంటిమెంట్ రాజేశారు. ఈ దెబ్బతో అటు నందమూరి ఫ్యామిలీని కూల్ చేసి.. ఇటు రాజకీయంగా సెంటిమెంట్ తో గెలిచేందుకు స్కెచ్ గీశారు. అయితే ఆమె రాత్రికి రాత్రి కన్ఫం అయ్యి కూకట్ పల్లి బరిలో నిలవడంతో టీడీపీ నేతల నుంచి అసమ్మతితోపాటు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. గెలుపు అంతా ఈజీ కాదని క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి తెలుస్తోంది.
సుహాసిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో బాబుకు అనుకూల కమ్మ సామాజికవర్గమంతా ఏకమై సుహాసిని గెలుపుకోసం లాబీయింగ్ చేస్తున్నారట.. టీడీపీ నేతలతో కలిసి కమ్మ సామాజికవర్గం నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. వీరికి తోడుగా పరిటాల సునీతను కూడా రంగంలోకి దిగి బాబు ప్రచారం చేయిస్తున్నారు.
కూకట్ పల్లిలో ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇందులో కమ్మ సామాజికవర్గం దాదాపు 13వేల మంది దాకా ఉంటారట.. వీరంతా అనాదిగా టీడీపీ ఓటుబ్యాంకుగా ఉన్నారు. ఇక మిగిలిన సామాజికవర్గాలను చూస్తే కూకట్ పల్లిలో 22వేల మంది రెడ్డి సామాజికవర్గ ఓటర్లున్నారు. వారంతా బాబుకు ఓటేయరు.. వీరంతా కాంగ్రెస్ - టీఆర్ ఎస్ కే ఓటు వేసే అవకాశాలున్నాయి. ఇక కాపు సామాజికవర్గంలోని ఉపకులాలతో కలిసి కూకట్ పల్లిలో మొత్తంగా 62వేల మంది ఉన్నారట.. ఏపీలో జనసేనాని పవన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళుతుండడం.. కాపులకు చంద్రబాబు చేసిన మోసం దృష్ట్యా వీరంతా టీడీపీపై కోపంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ ఎస్ వైపే వీరి మొగ్గు కనిపిస్తోంది. పవన్ కూడా టీఆర్ ఎస్ కు అనధికారికంగా మద్దతిచ్చిన నేపథ్యంలో కాపుల ఓట్లు కూకట్ పల్లిలో ఏకమొత్తంగా గులాబీ పార్టీకే పడే అవకాశాలున్నాయి.
ఇలా సామాజికవర్గ కోణంలో చూస్తే కూకట్ పల్లిలో అత్యధికంగా ఉన్న కాపులు టీఆర్ ఎస్ వైపే ఉన్నారని అర్థమవుతోంది. ఈ లెక్కన టీడీపీ అభ్యర్థి సుహాసినికి గెలుపు ఈజీ కాదని అర్థమవుతోంది.