జ‌గ‌న్ హామీకి కాపు కాసిన మ‌హిళ‌లు

Update: 2018-08-03 05:25 GMT
తృచ్చ‌మైన రాజ‌కీయాలు నాకు చేత‌కావు. చేసేదే చెబుతా. చెప్పేదే చేస్తా లాంటి ముక్కుసూటి మాట‌లు ఇవాల్టి రాజ‌కీయాల్లో క‌నిపించ‌వు. ఏంటి?.. కిలో బంగారం కావాలా?  దాందేముంది.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అదే లాంటి హామీల్ని ఇచ్చేందుకు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌సేమిరా అంటారు. తాను అబ‌ద్ధం చెబితే.. అధికారం వ‌స్తుంద‌న్న మాట‌కు సైతం.. నో చెప్పి.. మాట త‌ప్ప‌టం.. మ‌డ‌మ తిప్ప‌టం మ‌ర‌ణంతో స‌మానంగా భావించే జ‌గ‌న్.. ఈ మ‌ధ్య‌న కాపు రిజ‌ర్వేష‌న్ల మీద త‌న మాట‌ను చెప్పారు.

ప్ర‌తి మాట‌లోనూ ఏదో ఒక పెడార్థాన్ని తీసే ద‌రిద్ర‌పు ల‌క్ష‌ణం ఉన్న నేత‌లు.. కాపు రిజ‌ర్వేష‌న్ల పై జ‌గ‌న్ చెప్పిన అంశాల్లోని స‌త్యాన్ని ప‌ట్టించుకోవ‌టం వ‌దిలేసి.. ఏదో ర‌కంగా రాజ‌కీయ దాడి చేయ‌టానికి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నించారు. దీనిపై కాపు స‌మాజం నెగిటివ్ గా రియాక్ట్ కాకున్నా.. ఏదో అయిపోయింద‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేస్తూ.. బాబు బ్యాచ్ కు చెందిన మీడియా భారీ హెడ్డింగుల్ని పెట్టేసింది.

ఇక‌.. బాబు బ్యాచ్ కు చెందిన సోష‌ల్ నెట్ వ‌ర్క్స్ లోనూ హ‌డావుడి హ‌డావుడి చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాపు వ‌ర్గానికి చెందిన వారు ఎలా ఉన్నారు?  వారి రియాక్ష‌న్ ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి స‌మాధానంగా తాజాగా ఒక ప‌రిణామం చోటుచేసుకుంది.

జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. ఈ సంద‌ర్భంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు మ‌హిళ‌లు జ‌గ‌న్ కు స్వాగ‌తం ప‌ల‌క‌టం క‌నిపించింది. అంతే కాదు.. కాపు రిజ‌ర్వేష్ల మీద జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు తాము వంద శాతం మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న మాట‌నే కాదు..కాపుల‌కు రూ.10వేల కోట్లు ఇస్తాన‌న్న జ‌గ‌న్ హామీని స్వాగ‌తించటం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ తో వారు మాట్లాడుతూ.. బాబు త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌క‌పోగా.. ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చోబెట్టినందుకు తాము రోడ్ల మీద‌కురావాల్సి వ‌చ్చింద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. బాబు ఇస్తాన‌న్న రిజ‌ర్వేష‌న్లు ఎక్క‌డ అని అడిగినందుకు కాపు నాయుకుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని నానా ఇక్క‌ట్లు పెట్టి మంచం ప‌ట్టేలా చేసిన వైనాన్ని గుర్తు చేశారు. బాబు మాట‌ల్ని ఇంత‌కాలం న‌మ్మి మోస‌పోయిన‌ట్లుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వారు.. కాపుల‌కు రూ.5వేల కోట్లు ఇస్తామ‌ని చెప్పి.. ఇప్ప‌టివ‌ర‌కే కేవ‌లం రూ.1340 కోట్లు ఇచ్చి మోసం చేశార‌ని మండిప‌డ్డారు.

కాపు రిజ‌ర్వేష‌న్ల పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు న‌ష్టం వాటిల్లేలా ఉన్నాయంటూ చేస్తున్న దుష్ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌న్న వైనం.. జ‌గ‌న్ కు కాపు మ‌హిళ‌లు త‌మ ఆవేద‌న‌ను పంచుకున్న ప‌రిణామంతో నిరూపిత‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News