మ‌ళ్లీ డ్ర‌గ్స్ క‌ల‌క‌లం...ఎమ్మెల్యేకు టాప్ డైరెక్ట‌ర్ వార్నింగ్‌

Update: 2019-08-19 13:04 GMT
టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసిన డ్ర‌గ్స్ ఉదంతం ఇండస్ట్రీ చ‌రిత్ర‌లో పెద్ద చీక‌టి చ‌రిత్ర‌గా మిగిలిపోతుంది. ఆ డ్ర‌గ్స్ ఇష్యూతో ఇండ‌స్ట్రీ వాళ్లు అంటేనే చీత్క‌రించుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ఆ పాత సంగ‌తులు మ‌ర్చిపోయి ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌ను డ్ర‌గ్స్ ఉందంతం కుదిపేస్తోంది. బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, దర్శకుడు కరణ్ జోహర్ ఏర్పాటు చేసిన విందు వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ విందులో బాలీవుడ్ స్టార్లు అయిన షాహీద్ కపూర్ - మీరా రాజ్‌పుత్ - రణ్‌బీర్ సింగ్ - మలైకా అరోరా - వరుణ్ ధావన్ - నటాషా దలాల్ - అర్జున్ కపూర్ - వికీ కౌశల్ - జోయా ఆక్తర్ - ఆయన్ ముఖర్జీ లాంటి సినీతారలు పాల్గొన్నారు. ఈ పార్టీలో విచ్చ‌ల‌విడిగా డ్ర‌గ్స్ వాడారంటూ ఎమ్మెల్యే మంజింద‌ర్ ఎస్ సిర్సా తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మీడియా మొత్తం ఈ పార్టీ పై పుంకాను పంకాలుగా వార్త‌లు రాయ‌డంతో పాటు ఈ పార్టీని చిలువ‌లు ప‌ల‌వ‌లు చేసేసింది.

దీంతో ఈ పార్టీ ఇచ్చిన క‌ర‌ణ్‌కు మండిపోయింది. తాను డ్ర‌గ్స్ వాడ‌డం లేదంటూ వివ‌ర‌ణ ఇచ్చినా... మ‌ళ్లీ త‌న‌పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో క‌ర‌ణ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఈ పార్టీపై మంజింద‌ర్ స్పందిస్తూ బాలీవుడ్ స్టార్స్ మ‌త్తులో తూలుతోన్న తీరు చూస్తుంటే వాస్త‌వానికి, భ్ర‌మ‌ల‌కు తేడా ఏంటో తెలుస్తుంద‌ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసి ఇది నిజ‌మో... కాదో మీరే తేల్చాల‌ని కూడా చెప్పాడు.

ఈ ఆరోప‌ణ‌ల‌పై ఓ ఇంట‌ర్వ్యూలో క‌ర‌ణ్ మాట్లాడుతూ సినిమా తార‌లు కొంద‌రు వ‌రుస‌గా క‌ష్ట‌ప‌డుతుండ‌డంతో ఎంజాయ్ చేసేందుకు వ‌చ్చి... అక్క‌డ చ‌క్క‌ని అనుభూతి పొందారు. ఆ పార్టీలో డ్ర‌గ్స్ వినియోగించ‌డం త‌ప్ప‌ని తెలియ‌నంత వెధ‌వ‌ను కాద‌ని ఘాటుగా త‌న‌పై ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌పై ఎవ‌రో చేసిన చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం కూడా త‌న‌కు లేద‌న్న క‌ర‌ణ్... చీప్‌గా మాట్లాడి ప్ర‌జాదార‌ణ పొందాల‌ని అనుకోవ‌డం చ‌వ‌క‌బాబ‌రు త‌న‌మే అవుతుంద‌ని ఎమ్మెల్యేకు కౌంట‌ర్ ఇచ్చారు.
Tags:    

Similar News