ప్రజలకు ఒక సమస్య ఎదురైతే ప్రభుత్వానికి విన్నవిస్తారు. మరి, ప్రభుత్వమే సమస్య అయితే..? దేశమే దోషి అయితే..? ఎవరికి చెప్పుకోవాలి?? ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రజల్లో పాకిస్తానీలు కూడా ఒకరు. నిత్యం కర్ఫ్యూ వాతావరణం తలపించే ప్రాంతాలు అక్కడ చాలానే ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి బలూచిస్తాన్. అక్కడ మహిళలకే కాకుండా పురుషులకు కూడా రక్షణ ఉండదు. చెప్పింది వినకపోయినా.. ఎందిరించి ప్రశ్నించినా.. అంతే సంగతులు. అదే కోవలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. ‘మా బాధలు వినండి.. మమ్మల్ని కాపాడండి’ అని ప్రపంచాన్ని అర్థించినందుకు.. ఆ గొంతు కోసేశారు. అది కూడా విదేశాల వరకూ తరిమి మరీ ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది.
మమ్మల్ని రక్షించాలంటూ..
‘కరీమా బలూచి..’ పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో నివసించే యువతి. అక్కడ మహిళలను అపహరించడం, అత్యాచారాలు, హత్యలు సర్వసాధారణం అయ్యాయని, మహిళలకే కాకుండా.. గవాళ్ళకూ భద్రత కరువైందని, తమని ఆదుకోవాలని కోరింది. ఈ కోరికే.. పెద్ద నేరమైంది. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాలని కోరడమే దోషమైంది.
ప్రధాని మోడీకి విన్నపం..
బలూచిస్ధాన్ లో నెలకొన్న పరిస్థితిని మార్చేందుకు జోక్యం చేసుకోవాలంటూ కరీమా ప్రధానమంత్రి నరేంద్రమోడికి బహిరంగంగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బలూచిస్ధాన్ లోని పరిస్ధితులు, అక్మకడ హిళల పరిస్ధితులు చాలా ఘోరంగా ఉన్నాయని, వెంటనే మోడిని జోక్యం చేసుకోవాలని కరీమా కోరింది. అప్పట్లో ఈ ప్రకటన యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. దీంతో.. మానవహక్కుల కార్యకర్తలు కూడా ఇంకా యాక్టివ్ అయ్యారు. దీంతో.. కరీమాపై పాక్ ప్రభుత్వం కక్ష పెంచుకుంది. తన విమర్శల ద్వారా అంతర్జాతీయంగా తమ ప్రతిష్టను దిగజార్చిందని భావించి.. కరీమాను తుదముట్టించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. బలూచిస్థాన్ లో కరీమాపై దాడులు మొదలయ్యాయి. అయితే.. బలూచిస్ధాన్ నుండి ఎలాగో తప్పించుకున్న కరీమా కెనాడకు పారిపోయింది. కెనాడా నుంచే బలూచిస్ధాన్ పరిస్ధితులపై పోరాటాలు కొనసాగించింది.
అంతర్జాతీయ సమాజం స్పందించాలని..
కరీమా నరేంద్రమోడికి విన్నవించినా.. ఆ కోరిక అర్థం అంతర్జాతీయ సమాజం స్పందించాలని. పాకిస్థాన్ కు దాయాది దేశంగా ఉన్న భారత్.. ఆ దేశంలోని సొంత వ్యవహారాల్లో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కాబట్టి స్పందించాల్సింది ఐక్యరాజ్య సమితి మాత్రమే. ఐరాస ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో అంశాలనున పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ.. కరీమా అంశంతో బలూచిస్థాన్ లో పరిస్థితులు ఏంటనేది మాత్రం యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది.
పగ పెంచుకొని..
దేశంలో నెలకొన్న పరిస్థితులను ప్రపంచానికి తెలిపిందనే అక్కసుతో కరీమాపై పాక్ పగ పెంచుకొందనే ప్రచాారం సాగింది. ఈ క్రమంలో కరీమా కెనాడుకు వెళ్లినప్పటికీ.. అక్కడ కూడా కరీమా మీద దాడులు మొదలయ్యాయి. కరీమా కన్నా ముందే కెనాడాలో చాలామంది పాకిస్ధాన్ రిటైర్డ్ ఆర్మీ అధికారులున్నారని సమాచారం. పాకిస్ధాన్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే వారు కరీమాపై దాడులు చేపట్టారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే టోరంటోలోని లేక్ షోర్ సమీపంలో నిర్జీవంగా పడి ఉన్న కరీమాను అక్కడి పోలీసులు గుర్తించారు. దాంతో అసలు విషయం బయటకువచ్చింది.
ఆమె బయటపడింది కానీ..
ఇదే తరహాలో పాకిస్థాన్ బాలిక మలాలాపై దాడి జరిగిన విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేదు. ఆడపిల్లలు చదువుకోవద్దంటూ ఉగ్రవాదులు ఇచ్చిన ఆదేశాలను ఎదిరించి బాలికల విద్యకోసం నినదించినందుకు పాఠశాలకు వెళ్లివస్తుండగా బస్సులోనే ఉగ్రమూకలు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో బుల్లెట్లు తగిలి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన మలాలా.. ఆ తర్వాత బతికి బయటపడింది. కానీ.. కరీమా మాత్రం ప్రాణాలు దక్కించుకోలేకపోయింది. శాంతి కోసం పరితపించిన కపోతం నెత్తుటి మడుగులో కుప్పకూలింది. ఈ ఘటనతో పాాకిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.