లైంగిక ఆరోప‌ణ‌ల‌తో ఆ క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తి ఆత్మ‌హ‌త్య

Update: 2022-09-05 13:30 GMT
లైంగిక ఆరోప‌ణ‌ల‌తో కర్నాటకలోని ఒక లింగాయత్ మత గురువు సెప్టెంబ‌ర్ 5న సోమవారం బెలగావి జిల్లాలోని తన మఠంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. శ్రీ గురు మడివాళేశ్వర మఠానికి చెందిన బసవ సిద్దలింగ స్వామి మ‌ఠంలోని త‌న గ‌దిలో ఉరి వేసుకుని మ‌ర‌ణించిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు, ప‌రిచారికులు తెలిపారు.

బ‌స‌వ సిద్ధ‌లింగ‌స్వామి ఆత్మ‌హ‌త్య చేసుకున్న గ‌దిలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సూసైడ్ నోటులో ఏముంద‌నేది ఇంకా తెలియ‌రాలేదు.

తాజాగా ఇద్దరు మ‌హిళ‌లు కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశార‌ని చెబుతున్నారు. అది అక్క‌డ వైర‌ల్ గా మారింద‌ని అంటున్నారు. ఆ వీడియోలో లింగాయత్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన బసవ సిద్ధలింగ స్వామి పేరు కూడా ప్రస్తావన వచ్చింద‌ని అంటున్నారు.

దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న అనుచరులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా సెప్టెంబ‌ర్ ప్రారంభంలో, రాష్ట్రంలోని కీలకమైన లింగాయత్ మ‌ఠాల‌లో ఒక‌టైన‌ మురుగ మఠానికి అధిపతిగా ఉన్న శివమూర్తి శరణారావును ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

కొన్నాళ్లుగా ఆయ‌న తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆశ్ర‌మంలో ఉన్న పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఇద్ద‌రు ప‌దో త‌ర‌గ‌తి బాలికలు ఆరోపించారు. దీంతో వివిధ సంఘాల నిర‌స‌న‌ల‌తో ఆయ‌న‌ను అరెస్టు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News