మీడియాను చూసి పరుగుతీసిన సీఎస్

Update: 2016-01-11 07:48 GMT
ఈ రోజుల్లో మీడియా కనిపించిందంటే ఏం అడుగుతారో ? ఏం ప్రశ్న వేస్తారో ? అని అందరికీ అనుమానం. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మీడియా సంస్థలను చూసి అందరూ విసుక్కోవడం ..భయపడడం.. అగ్రహించడం తరచూ చూస్తున్నాం. అయితే మీడియా భయానికి ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరుగెత్తాడంటే నమ్ముతారా ? ఖచ్చితంగా నమ్మాల్సిందే.

కర్ణాటకలో ఎంపీలకు కేటాయించిన నిధుల మీద అక్కడి సచివాలయంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి లోక్ సభ ఉప సభాపతి తంబిదురై హాజరయ్యారు. ఈ సమావేశానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు.

వచ్చిందే తడవు ఆయన అక్కడ ఉన్న మీడియాను చూసి పరుగు లంకించుకున్నారు. మూడో అంతస్తులోని తన కార్యాలయంలోకి వెళ్లేదాకా ఆయన ఆగలేదు. అంతేకాదు తన ఛాంబర్ లోకి వెళ్లి ఏకంగా గడియ కూడా పెట్టేసుకున్నాడు. ఆయన ఎందుకు ఆలా పరిగెత్తాడు అని ఆరాతీస్తే మీడియా ఎక్కడ తనను ఆలస్యంగా వచ్చావని మీద పడి ప్రశ్నలు అడిగి ఉక్కిరి బిక్కిరి చేస్తుందేమో ? అని భయపడ్డాడట. అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్న మీడియా ..ఇంతేనా అని వెనక్కు తిరిగిందట.
Tags:    

Similar News