ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో వైర‌స్‌: సీఎంఓ మూసివేత‌

Update: 2020-06-19 17:30 GMT
వైర‌స్ వ్యాప్తి కర్ణాటక కొంచెం తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఆ వైర‌స్ ప్ర‌బ‌లుతోంది. ఆ రాష్ట్రంలో 7,944 కేసులు న‌మోద‌య్యాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కుటుంబసభ్యుడికి వైర‌స్ వ్యాపించింద‌నే వార్త క‌ల‌వ‌రం రేపింది. సీఎం ఆఫీస్‌లో పని చేస్తున్న ఒక మహిళా సిబ్బంది.. ఆమె భర్తకు కూడా వైర‌స్ రావడంతో వారు హోం క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉలిక్కిప‌డింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యాన్ని కొన్ని రోజులు మూసివేయాల‌ని నిర్ణ‌యించారు.

ముఖ్య‌మంత్రి యడ్యూరప్ప క్యాంపు కార్యాలయ భవనాన్ని అధికారులు మూసివేశారు. రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిలిపివేశారు. వైర‌స్ వ్యాప్తి లేకుండా శుక్రవారం శానిటైజేషన్ ప్రారంభించారు. రెండ్రోజుల పాటు ప‌రిశుభ్రం చేసి తిరిగి పునఃప్రారంభిస్తామ‌ని, అనంత‌రం య‌థావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని సీఎంఓ అధికారులు తెలిపారు. కార్యాలయాన్ని శానిటైజ్ చేయడంలో భాగంగానే భవనాన్ని మూసివేస్తున్నామని అధికారులు వివ‌రించారు. కార్యాల‌యం మూసివేత‌తో రెండు రోజులపాటు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన అధికార కార్యక్రమాలను విధాన్ సౌధ నుంచి నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News