ఏపీ సీఎంకు షాక్.. కర్ణాటక సర్కార్ అభ్యంతరం

Update: 2020-01-31 07:25 GMT
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు కార్పొరేట్ చదువులు ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన ‘ఇంగ్లీష్ మీడియం’కు దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ హైకోర్టు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించడం కరెక్ట్ కాదని సూచించింది.

తాజాగా ఏపీ సీఎం జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం పై కర్ణాటక ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలుపడం గమనార్హం. జగన్ సర్కారు తీసుకున్ననిర్ణయం కారణంగా ఏపీ సరిహద్దుల్లోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల చదువుతున్న కన్నడిగులకు ఇబ్బంది తలెత్తుతుందని కర్ణాటక సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరి హద్దుల్లో కన్నడ మీడియం చదువుతున్నారని.. జగన్ నిర్ణయం మైనార్టీలైన కన్నడిగుల హక్కులకు భంగం వాటిల్లుతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.

సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ప్రతీ విద్యార్థి ఇంగ్లీష్ తోపాటు తెలుగు లేదా ఉర్ధూ చదువుతారని.. దీంతో కన్నడ భాష కనమరుగవుతుందని.. రాష్ట్రాల మధ్య బంధాలు నాశనమవుతాయని కర్ణాటక సర్కారు లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణ దేవరాయల కాలం నుంచి తెలుగు, కన్నడ ప్రజల మధ్య బంధం ఉందని దాన్ని కొనసాగించాలని జగన్ ను కోరారు.

ఇక ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల కన్నడ చెప్పే టీచర్ల భవిష్యత్తు నాశనమవుతుందని.. విద్యార్థులకు కన్నడ దూరమవుతుందని.. మైనార్టీ కన్నడ లాంగ్వేజ్ స్కూళ్లను కొనసాగించాలని ఏపీ సీఎం ను కర్ణాటక సర్కారు లేఖలో కోరింది.
Tags:    

Similar News