లాక్‌ డౌన్ ఎత్తివేత‌కు బీజేపీ రాష్ట్రం సై!

Update: 2020-04-29 15:30 GMT
దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌ డౌన్ మే 3 వ తేదీన ముగియ‌నుంది. అయితే దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో లాక్‌ డౌన్ కొన‌సాగుతుందా.. లేదా అనే ఉత్కంఠ ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్‌ లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ లాక్‌ డౌన్‌ పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. లాక్‌ డౌన్ పొడిగింపుకే సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో లాక్‌ డౌన్‌ ను పొడిగించే యోచ‌న‌లో చాలా రాష్ట్రాలు ఉండ‌గా క‌రోనా ప్ర‌భావం లేని రాష్ట్రాలు లాక్‌ డౌన్ ఎత్తివేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ పాలిత రాష్ట్రం క‌ర్నాట‌క లాక్‌ డౌన్ ఎత్తివేసే యోచ‌న‌లో ఉంది.

లాక్‌ డౌన్ అనంత‌రం పాక్షిక మిన‌హాయింపులు - గ్రీన్ జోన్ ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌ డౌన్‌ ను ఉపసంహ‌రించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని మొత్తం 30 జిల్లాల్లో 22 గ్రీన్ జోన్లుగా ఉన్నాయి. క‌రోనా ప్ర‌భావం లేని ఈ జిల్లాల్లో వ్యాపారాలు - ఇత‌ర కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌డానికి ప్ర‌భుత్వం సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే చిన్న చిన్న దుకాణాల‌ను ప‌గ‌లంతా తెర‌వ‌డానికి ప‌చ్చ‌జెండా ఊపిందంట‌. ఈ ప్రాంతాల్లో మాల్స్ - థియేట‌ర్లు వంటివి పునఃప్రారంభించే యోచ‌న‌లో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఉంది. ద‌శ‌ల‌వారీగా ప్రాధాన్య క్ర‌మంలో లాక్‌ డౌన్ మిన‌హాయింపులు ఇచ్చేలా క‌ర్నాట‌క‌లో ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

క‌ర్ణాట‌క‌లో 520 క‌రోనా కేసులు న‌మోదు కాగా వారిలో 20 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ అంత‌గా విస్త‌రించలేదు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌రోనా ప్ర‌భావం ఉండ‌గా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వైర‌స్ జాడ‌లేదు. దీంతో మే 3వ తేదీ త‌ర్వాత గ్రీన్‌ జోన్ ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ ను ఎత్తివేసే అవ‌కాశాలు ఉన్నాయి.

క‌ర్నాట‌క‌లోని మైసూరు - బెంగ‌ళూరు వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో మాత్ర‌మే క‌రోనా కేసులు భారీగా ఉన్నాయి.  వాటితో క‌లిపి మొత్తం 8 జిల్లాల్లో క‌రోనా ప్ర‌భావం ఉంది. రెడ్ జోన్‌లో ఉన్న ఈ ప్రాంతాల్లో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.


Tags:    

Similar News