కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత మంగళవారం సభలో బలపరీక్షలో విఫలం కావడంతో కుమారస్వామి నేతత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిన సంగతి తెలిసిందే. అనంతరం సభలో 105 ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కుమారస్వామి తరహాలోనే యడియూరప్పకు కూడా విశ్వాస పరీక్ష వెంటాడుతోంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతుతో పాటు స్వతంత్య్ర ఎమ్మెల్యే హెచ్.నగేశ్, బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లే. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా ఐదుగురు సభ్యుల అవసరం ఉంది.
ఈనేపథ్యంలో బీజేపీ ఎవరికి గాలం వేస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ - జేడీఎస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటే బీఎస్ యడియూరప్ప మరోసారి విఫలం కావడం ఖాయం. ఇప్పటికే గత గురువారం రాత్రి ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడంతో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వారం రోజుల్లో విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు.
శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వీఆర్ వాలా సమక్షంలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప మాత్రమే ప్రమాణం చేశారు. శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న అనంతరం మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు యడియూరప్ప వివరించారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం బల నిరూపణ - అసమ్మతి ఎమ్మెల్యేల విషయం గురించి తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈక్రమంలో భారం మొత్తం యడ్డీ నెత్తి మీదకు వచ్చింది. బల పరీక్ష సమయంలో కాంగ్రెస్ - జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరు అవుతారా? వస్తే ఏ పార్టీకి ఓటు వేస్తారు? లేక డుమ్మా కొడుతారా? అనే దానిపై యడియూరప్ప భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాగా ముఖ్యమంత్రిగా యడియూరప్పను కాదని మరో వ్యక్తి పేరును సూచిస్తే.. అంగీకరించేది లేదని మెజారిటీ బీజేపీ శాసనసభ్యులు పట్టుబట్టినట్లు తెలిసింది. వయసు మీద పడిందని యడియూరప్ప స్థానంలో అనంతకుమార్ హెగడే - మాధుస్వామి పేర్లు వినిపిస్తున్నాయి.
బలాబలాలు
మొత్తం సభ్యులు – 225 (నామినేటెడ్ తో కలిపి)
బీజేపీ – 105
కాంగ్రెస్ + జేడీఎస్ – 99
స్వతంత్య్ర – 01
బీఎస్పీ – 01
రాజీనామా – 13 మంది
అనర్హత వేటు – ముగ్గురిపై
గైర్హాజరు – ఇద్దరు (బి.నాగేంద్ర - శ్రీమంతపాటిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు)
నామినేటెడ్ – 01
ప్రభుత్వ ఏర్పాటుకు – 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం