తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ గడప తొక్కినప్పటికీ.. చాలా మంది అభాగ్యులకు త్వరగా న్యాయం జరగదు. మరికొంత మందికి ఎప్పటికీ న్యాయం దక్కదు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇదేవిధంగా ఓ మహిళ కంప్లైంట్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆమెను క్షోభపెట్టినందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ కు కోర్టు సరికొత్త శిక్ష విధించింది.
కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కర్ణాటక హైకోర్టు వింత పనిష్మెంట్ ఇచ్చింది. తాను పని చేస్తున్న స్టేషన్ ముందు ఉన్న పబ్లిక్ రోడ్డు ఊడ్చాలని ధర్మాసనం ఆదేశించింది.
కొద్ది రోజుల క్రితం ఒక మహిళ తన కొడుకు కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్ తలుపు తట్టింది. కానీ.. పోలీసులు ఆమెను పట్టించుకోలేదు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా వారం రోజులుగా వేడుకుంటున్నా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు అక్కడి పోలీసులు. దీంతో.. బాధిత మహిళ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్, జస్టిల్ పి క్రిష్ణా భట్‌ల డివిజన్ బెంచ్.. సదరు కానిస్టేబుల్‌కు చీవాట్లు పెట్టి, పబ్లిక్ రోడ్డు ఊడ్చాలని ఆదేశించింది. ఈ విషయమై ఆ కానిస్టేబుల్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించిన ప్రకారం రోడ్డు ఊడుస్తానన్నాడు. అంతే కాకుండా.. బాధిత మహిళ ఫిర్యాదును స్వీకరించనందుకు క్షమాపణలు కోరాడు.