వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు

Update: 2021-12-09 11:04 GMT
వైసీపీ నేతల అరెస్ట్ కలకలం రేపింది. అది సొంత రాష్ట్రంలో కాదు.. పక్కనున్న కర్ణాటక రాష్ట్ర పోలీసులు తాజాగా వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేత, మాజీ సర్పంచ్ తాతాజీని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్కడ ఎంపీడీవోను దుర్భాషలాడిన కేసులో తాతాజీ అరెస్ట్ అయ్యారు.

ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా హిందూపురం వైసీపీ నేతల పలువురిని కర్ణాటక పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

దొంగ బంగారం వ్యవహారంలో హిందూపురం వైసీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో ఓ దొంగల ముఠాను అదుపులోకి తీసుకొని కర్ణాటక పోలీసులు విచారణ నిర్వహించారు.

ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు హిందూపురంలోని ముగ్గురు వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని తెలిసింది.

దీంతో కర్ణాటక పోలీసుల వాహనాలను అడ్డుకొని వైసీపీ నేతలు రచ్చ చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్న వైసీపీ నేతలను కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్లారు.


Tags:    

Similar News