క‌ర్నాట‌క‌లో వింత‌: క‌రోనా భ‌యంతో పొలాల్లో మ‌కాం

Update: 2020-04-12 14:27 GMT
కరోనా వైరస్ భ‌యంతో ప్ర‌జ‌లు త‌మ త‌మ రీతిలో అప్ర‌మ‌త్తంగా ఉంటూ జాగ్ర‌త్త ప‌డుతున్నారు. త‌మ‌కు తోచిన విధంగా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ క‌రోనా రాకుండా క‌ట్టుదిట్టంగా ఉంటున్నారు. ప‌ట్ట‌ణాల్లో క‌న్నా గ్రామాల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. వారు క‌రోనా వ్యాపించ‌కుండా గ్రామంతో పాటు త‌మ కుటుంబానికి కాపాడుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్నాట‌క రాష్ట్రంలో గ్రామాల ప్ర‌జ‌లు ప‌ల్లెల‌ను వ‌దిలి పొలాల బాట ప‌డుతున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో బెంగళూరు వంటి నగరాల నుంచి ప్ర‌జ‌లు ప‌ల్లెల‌కు చేరారు. ఇప్పటికే ఖాళీ అయ్యాయి. సాఫ్ట్‌ వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వడంతో ఉద్యోగులు స్వగ్రామాలకు తరలివెళ్లారు. అయితే ఆ సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులంతా గ్రామాల‌కు చేర‌డంతో ఆయా గ్రామ‌స్తులు భ‌య‌ప‌డుతున్నారు. ఎందుకంటే సాఫ్ట్‌ వేర్ ఉద్యోగుల వ‌ల‌న క‌రోనా వైర‌స్ సోకుతుంద‌నే అనుమానంతో ప్ర‌జ‌లు గ్రామాలు ఖాళీ చేసి పొలాల‌కు వెళ్తున్నారు. ఈ మహమ్మారి భయంతో కొన్ని గ్రామాల ప్రజలు త‌ట్టాబుట్టా సర్దుకుని పిల్లా - పాపలతో పొలాల‌కు వెళ్తున్నారు.

ఇలాంటి సంఘ‌ట‌నే కర్ణాటకలోని తుమకూరు జిల్లా ముద్దెనహళ్లిలో చోటుచేసుకుంది. ముద్దెనహళ్లికి చెందిన కొన్ని కుటుంబాలు రెండు - మూడు రోజులుగా తమ పొలాల్లో నివసిస్తున్నాయి. ప్రత్యేకంగా గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. వంట సామగ్రిని తీసుకుని వెళ్లి పొల్లాల్లో వండుకుని తింటూ అక్క‌డే గ‌డుపుతున్నారు. అయితే వాళ్లు అలా పొలాల‌కు వెళ్ల‌డానికి మ‌రో కార‌ణం ఉంది. ఎండలో ఆరుబయట నిద్రిస్తే క‌రోనా వైరస్ సోకదనే ఉద్దేశంతోనే ఆ గ్రామ‌స్తులు పొలాల‌కు వ‌చ్చారంట‌. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు వారిని కలుసుకున్నారు. అయితే అది త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని, ఆరు బయట నిద్రిస్తే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ‌గా ఉందని అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇళ్లల్లోనే నివసించాలని సూచించారు. లాక్‌ డౌన్ అమలులో ఉండ‌డంతో ఆరుబయట తిరగడం - నిద్రించడం వంటి పనులు ఉల్లంఘన కిందికి వస్తాయని - కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఆ గ్రామ‌స్తులు మళ్లీ ఇళ్ల బాట ప‌ట్టారు.

కరోనా వైరస్ క‌ర్ణాటకలోనూ తీవ్రంగా ఉంది. రాజ‌ధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు కరోనా వైరస్ పాకింది.  ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో 214 కేసులు న‌మోద‌య్యాయి. ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు.


Tags:    

Similar News