కార్తీక మాసం వచ్చేసింది. ఈ మాసంలో అందరూ సామూహిక వనభోజనాలకు వెళతారు.. గ్రామాల్లో మధ్య తరగతి ప్రజలు సమీప ప్రాంతంలోని అడవులు, పట్టణాల్లో రిసార్టులకు వెళుతుంటారు. ఆరోజు 500 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు చేస్తుంటారు. తాజాగా కార్తీక మాసంలో టెంపుల్ టూరిజం పేరిట పలు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు ప్యాకేజీలు కూడా ప్రకటించి ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు కార్తీక మాసంతోపాటు తెలంగాణలో ఎన్నికలు కూడా జరుగుతుండడంతో రాజకీయ నాయకులు వివిధ కులసంఘాలకు ‘ఉచిత వన భోజనాల’ను ఆఫర్ చేస్తున్నారు. కులాలను బట్టి ప్యాకేజీలు ఇస్తూ ఓట్లను ఆకర్షించే పనిలో వివిధ పార్టీల నేతలు బిజీగా ఉన్నారు.. తాజాగా శేర్ లింగపల్లిలో ఓ నాయకుడు ఇటీవల కార్తీక మాసం సందర్భంగా భారీగా ఓట్లు ఉన్న ఓ కుల సంఘానికి మియాపూర్ లోని ఓ రిసార్ట్ లో విందు ఏర్పాటు చేశారు. ఇందులోనే వారికి ఓటు వేయాల్సిందిగా డబ్బులు, బహుమతులు అందజేసినట్టు సమాచారం. దీనిపై ఎన్నికల అధికారులు (ఎస్ఎస్ టీ), ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వాడ్స్ కు ఉప్పందినట్టు సమాచారం. దీనిపై పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది..
కార్తీక మాసంలో హోటల్ వ్యాపారాలు డల్ గా ఉంటాయి.. ప్రజలు ఎక్కువగా మద్యం, మాంసం తినలేరు. అయితే ఎన్నికల సీజన్ కావడంతో ఇప్పుడు అనూహ్యంగా హోటల్ వ్యాపారాలు నాయకుల హడావుడితో పెరిగాయి. ప్రతిరోజు ఓ నాయకుడి ప్రచారంలో కనీసం 100మంది పాల్గొంటారు. వారికి మధ్యాహ్నం భోజనం... బిర్యానీలు, అల్పాహారం కోసం ఎంత లేదన్నా నాయకులు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రచారం కోసం కార్మికులను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో ప్రతిఅభ్యర్థి వీరి కోసం దాదాపు ప్రతిరోజు నియోజకవర్గం మొత్తం రూ.1 లక్ష వరకు భరించాల్సి వస్తోంది. ఇందులోనే వారికి రోజువారి వేతనం కూడా భరిస్తున్నారు. ప్రచారానికి వచ్చే వారికి భోజనాలు ఇతర అవసరాల కోసం హోటల్స్ అన్నీ రాత్రి వరకు పనిచేస్తున్నాయి. అంతేకాదు... రాజకీయ నేతల కోరిక మేరకు అర్ధరాత్రి కూడా డోర్ డెలివరీ పేరుతో హోటల్స్ భోజనాలు, విందులు సరఫరా చేస్తున్నాయి. ఈ కారణంగా కార్తీక మాసంలో ప్రజలు లేకపోయినా ఎన్నికలలో నిల బడ్డ నేతల వల్ల హోటల్ వ్యాపారం మూడు పువ్వులు , ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
తాజాగా రాజకీయ నేతలకు భోజన ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా జోమాటో, స్విగ్గి, ఉబెర్ ఆప్ లు ప్యాకేజీలు రెడీ చేశాయి. వీరు ప్రచారానికి వచ్చే వారి కోసం ఎంతైనా తయారు చేయడానికి రెడీ అయ్యాయి. ‘ఒక డెలివరీ బ్యాయ్ 18 ఆర్డర్ల వరకు భోజనాన్నిసరఫరా చేస్తున్నాడు. సాధారణ రోజుల్లో నాలుగైదుకు మించదు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 100 ఆర్డర్లు మొత్తం పంపిణీ చేస్తున్నాం.. ఒక్కో డెలివరీకి ఇందుకోసం రోజుకు 1500 వరకూ చెల్లిస్తున్నాం.. చాలా మంది రాజకీయ నేతల తమ కార్యకర్తల కోసం భారీ ఆర్డర్లు ఇస్తున్నారని’’ ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్ చెప్పుకొచ్చాడు.. ఇలా కార్తీక మాసమైనా సరే ఉచిత వనభోజనాలతో హోటళ్ల పంట పండుతోంది.. జనాలకు విందులు దక్కుతున్నాయి.