టీడీపీకి షాక్..టికెటివ్వనందుకు రెబల్ గా పోటీ

Update: 2019-03-20 09:51 GMT
ఎన్నికల ముందర టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతి సెగ తగిలింది. టీడీపీ కోసం పాటుపడిన వ్యక్తికి సీటు ఇవ్వకపోవడంతో అతడు రెబల్ గా మారాడు. ఏకంగా టీడీపీ అభ్యర్థిని ఓడించి గెలుస్తానని పంతం పట్టాడు.  ఈ విచిత్రం ఇప్పుడు చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

తంబల్లిపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కే మళ్లీ టికెట్ ఇచ్చింది. అయితే దీన్ని తీవ్ర వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ సాంకేతిక  రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరస్వామి నాయుడు టీడీపీకి రాజీనామా చేశాడు. రెబెల్ అభ్యర్థిగా ఎల్లుండి నామినేషన్ వేయడానికి సిద్ధమవ్వడం టీడీపీ అధిష్టానాన్ని షాక్ కు గురిచేసింది..  అసెంబ్లీ ఎన్నికల ముందర ఇది టీడీపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఎందుకంటే దొరస్వామి నియోజకవర్గంలో మంచి నేతగా పేరున్నారు. 2014 ఎన్నికల్లో తనకు తంబాలపల్లి టికెట్ ఇవ్వకున్నా టీడీపీ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఈసారి కూడా టీడీపీ హ్యాండివ్వడంతో ఇక టీడీపీపై పోరుకు రెడీ అయ్యారు. ఒంటరిగా బరిలోకి దిగుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. దొరస్వామికి నియోజకవర్గంలోని 6మండలాల్లోని 3 మండలాల్లో  అనుచరగణం బంధువులు ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గంకు సన్నిహితంగా కలిసొచ్చే అంశాలు... దొరస్వామి నాయుడుకు మాజీ ఎమ్మెల్యేతో పాటు అనుచరులు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.దీంతో టీడీపీకి ఇక్కడ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోందట..

తంబల్లిపల్లిలో ముఖ్యంగా ఏవీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీని వీడిన సమయంలో నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలిచి దొరస్వామి పార్టీని బతికించాడు.అయితే అనూహ్యంగా శంకర్ యాదవ్ తెరపైకి రాగా టీడీపీ ఆయనకే టికెట్ ఇచ్చింది. పోయిన సారి ఊరుకున్న దొరస్వామి  రెండోసారి కూడా టీడీపీ టికెట్ నిరాకరించడంతో  ఈసారి రెబల్ గా బరిలోకి దిగారు.  చూడాలి మరి దొరస్వామి టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి షాకులు ఇస్తారో..


Tags:    

Similar News