గతంలో ఎప్పుడూ ఎదురుకాని అనుభవం టీఆర్ ఎస్ అధినాయకత్వానికి ఎదురైందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం వచ్చినా.. పట్టరాని ఆగ్రహం వచ్చినా ఆయన మాటలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రైతులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ఏమన్నారన్నది అందరికి తెలిసిన విషయమే.
దీని గురించి కవర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. మోడీని ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటలు వాట్సాప్ లో ఎంత భారీగా వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ.. తన తండ్రి అన్న మాటల్ని కవర్ చేసే విషయంలో మంత్రి కమ్ కొడుకు కేటీఆర్.. ఎంపీ కమ్ కుమార్తె తప్పులో కాలేశారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో తన తండ్రి నోటి వెంట మాట తప్పుగా అన్నారని.. మనసులో పెట్టుకోవద్దని కేటీఆర్ తనకు సూచించినట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పేశారు. మీ తండ్రి ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నిర్మలా.. అదే సమయంలో ఇలాంటి వేళ హైదరాబాద్ కార్యక్రమానికి రావాలా? అని అడగటంతో కేటీఆర్ కన్ఫ్యూజ్ కావటం.. కేసీఆర్ అన్న మాటల్నితనదైన శైలిలో కేటీఆర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
ఇంచుమించు ఇలాంటి పరిస్థితినే ఎంపీ కవిత ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి తన తండ్రి అన్న మాటలపై మీడియా ప్రతినిధి బృందం ప్రశ్నించినప్పుడు వివరణ ఇచ్చినట్లుగా మాట్లాడారు. దీనికి కొన్ని మీడియా సంస్థలు ఒక అడుగు ముందుకేసి తన తండ్రి కేసీఆర్ కోపంతో ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
కొడుకు.. కూతురు ఇద్దరూ తన మాటల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యం.. కేసీఆర్ కు కాలిపోయేలా చేసిందన్న భావన కలిగింది. అందుకే కాబోలు తన అమ్ములపొదిలోని వాదన అస్త్రాన్ని తీశారు కేసీఆర్. మూడు రోజుల నుంచి కొత్త కొత్తగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. తానేదో తప్పు అన్నట్లుగా చెబుతున్న టేపుల్ని తెప్పించుకొని చూశానని.. తానేం తప్పు మాట్లాడలేదన్నారు.
ఒకవేళ కేసీఆర్ మాటలే నిజమని అనుకుందాం. మరి.. ఆయన చెప్పింది నిజమే అయినప్పుడు ఆయన కుమార్తె.. కొడుకులు ఇద్దరు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఎందుకు? అన్నది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన మీడియా సంస్థలు ఏవీ కూడా నిజం ఏమిటన్న మాటల్ని టీవీలో చూపించలేని పరిస్థితి.
ఇలాంటివేళ.. కొడుకు.. కుమార్తెలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. కేసీఆర్ మాటలు నిజమైతే.. ఆయన కుమారుడు.. కుమార్తెలు తప్పుగా మాట్లాడినట్లు. ఒకవేళ కుమారుడు.. కుమార్తె ఇద్దరూ తమ తండ్రి నోరు జారారన్న మాట మీద ఇప్పటికి నిలబడితే కేసీఆర్ పరిస్థితి ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.