రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూసిన సన్నివేశం పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పేరు పెట్టి బలంగా విమర్శించేందుకు సైతం ప్రాంతీయ పార్టీలు మొదలు జాతీయ పార్టీలు సైతం సంకోచించే స్థాయి నుంచి ఇప్పుడు ఆయన కుమార్తె ఇంటికి సీబీఐ వారు వెళ్లి.. ప్రశ్నించే వరకు విషయం వెళ్లటం చాలామందిలో ఆసక్తిని.. అసలేం జరుగుతుందన్న ఉత్సుకతను పెంచింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లటం.. ఏకంగా ఏడున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించటం తెలిసిందే.
సుదీర్ఘ ప్రశ్నల్ని తన లాయర్ తో పాటు ఎదుర్కొన్న కవిత.. ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చి.. తన తండ్రి కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ కు బయలుదేరి వెళ్లటం తెలిసిందే. తండ్రి ఇంటికి కుమార్తె వెళ్లటం వార్త ఎంతమాత్రం కానప్పటికీ.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఎపిసోడ్ తర్వాత.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాత్రం కవిత ప్రగతిభవన్ కు వెళుతున్న వైనం మొదటి పేజీ వార్తగా మారుతుందన్నది మర్చిపోకూడదు.
సీబీఐ అధికారులు ప్రశ్నించిన అనంతరం బయటకు వచ్చిన ఆమెకు జయజయధ్వానాలు.. అభిమానుల కేరింతలతోపాటు.. తాము ఆమె వెంట ఉన్నామన్న విషయాన్ని మరింత గట్టిగా చెప్పే ప్రయత్నాన్ని నినాదాలతో చూపించారు. అదే సమయంలో కవిత సైతం వారి అభిమానాన్ని.. అప్యాయతను అర్థం చేసుకున్నట్లుగా రియాక్టు అయ్యారు. ఏడున్నర గంటల సీబీఐ అధికారుల ప్రశ్నల్ని ఎదుర్కొన్న ఆమె ఎలాంటి అలసటను.. చిరాకును ప్రదర్శించకుండా.. చాలా సంతోషంగా ఉన్నట్లుగా.. కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా చిరునవ్వులు చిందిస్తూ.. తానెంత ధైర్యంగా ఉన్నాన్న విషయాన్ని అర్థమయ్యేలా చేతులు ఊపుతూ కారులో ప్రగతి భవన్ వైపు వెళ్లటం తెలిసిందే.
బయట సీన్ ఇలా ఉన్నప్పుడు.. సీబీఐ అధికారులు ప్రశ్నలు వేస్తున్న వేళ.. కవిత తీరు ఎలా ఉంది? ఆమె ఎలా రియాక్టు అయ్యారు. ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ను సీబీఐ అధికారులు గుర్తించారు? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసినప్పుడు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అధికారుల ప్రశ్నలకు ఆమె టెన్షన్ కు గురి కావటం.. స్పష్టమైన.. సూటి సమాధానాలు చెప్పే కన్నా.. ఆచితూచి అన్నట్లుగా సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరి ముఖ్యంగా.. దాదాపు పది ఫోన్లను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందన్న విషయంపై ఎదురైన పలు ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానం అయితే మౌనంగా ఉండటమో.. లేదంటూ తనకు ఆ విషయం మీద అవగాహన లేదన్నట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
తాను ఎదుర్కొన్న ప్రశ్నల్లో చాలావాటికి "తెలీదు" అన్న సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్న కవిత.. లోపల తీరుకు బయట కారు వద్ద అభిమానులకు అభివాదం చేసిన సీన్ కు ఏ మాత్రం పోలిక లేదంటున్నారు. తాను సమాధానాలు చెప్పే క్రమంలో లాయర్ వైపు చూస్తూ ఉండిపోయారని.. సమాధానాలు అస్పష్టంగా చెప్పేందుకు ఆమె మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. లోపల సీన్ కు బయట సీన్ కు ఏ మాత్రం పొంతన లేదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.