ప్రతికారుకు ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటితే ఓవర్ లోడ్ అవుతుంది. ఓవర్ లోడ్ అయిన కారు బ్యాలెన్స్ తప్పుతుంది. మరి.. మీ కారులో ఇప్పటికే ఉన్న నేతలు.. బయట పార్టీల నుంచి వస్తున్న నేతలతో ఓవర్ లోడ్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. మీ కారు బ్యాలెన్స్ ఎలా అన్న సూటి ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. తమ కారు చాలా విశాలమైందని.. కొత్తగా వచ్చే వారితో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అందరూ కూర్చునేందుకు చోటు ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
లిమిట్ మించి కారులో ప్రయాణిస్తే.. ఆర్టీవో అధికారులు చెక్ చెబుతారని.. మరి మీ కారు పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు.. తమ కారుకు డ్రైవర్ గా కేసీఆర్ ఉన్నారని.. ఆయన డ్రైవింగ్ సామర్థ్యం మీద తమకు చాలా నమ్మకం ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బండిని తీసుకెళతారని.. ఎలాంటి డౌట్లు వద్దంటూ ఎంపీ కవిత ఎంతో కాన్ఫిడెంట్ తో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదే సందర్భంలో కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అంటున్నారు.. ఆ విషయాన్ని మీరే చెప్పారన్న ప్రశ్నకు బదులిస్తూ.. అల్రెడీ అందరికి తెలిసిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్న కవిత సమాధానం చూస్తే.. కేసీఆర్ తర్వాతి స్థానం ఎవరన్న విషయాన్ని కవిత తేల్చేసినట్లు చెప్పక తప్పదు.