కవితకు '11' అచ్చి రావటం లేదా?

Update: 2023-03-10 17:00 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే తన తండ్రిని సైతం ఇరకాటంలో పడేసే ఆమె మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కక్షతో కవితను టార్గెట్ చేశారని.. లేదంటే ఢిల్లీ మద్యం స్కాంలో ఆమెను ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాంకు సంబంధించిన విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ఈడీ చెప్పిన తేదీకి భిన్నంగా ఈ నెల11న ఆమె ఈడీ ఎదుట హాజరు కానున్నారు. కాకుంటే.. సదరు తేదీ ఆమెకు ఇటీవల కాలంలో అస్సలు అచ్చి రావటం లేదంటున్నారు. దీనికి సంబంధించిన పలు ఉదాహరణల్ని చూపిస్తున్నారు కూడా. ఢిల్లీ మద్యం  కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని కవిత నివాసంలో సీబీఐ తొలిసారి విచారణ చేపట్టటం తెలిసిందే. ఆమెను విచారించింది డిసెంబరు 11న ఉదయం 11 గంటలకు ప్రత్యేక టీం ఆమెను కలిసి.. పలు ప్రశ్నలు వేసిన వైనం తెలిసిందే.

నాడు కవితను సాక్షిగా మాత్రమే ఏడున్నర గంటల పాటు విచారించి పలు ప్రశ్నలకు సమాధానాల్ని రాబట్టే ప్రయత్నం చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమెకు ఈడీ నుంచి నోటీసులు రావటం.. అది కూడా 11 వ తేదీన కావటం గమనార్హం. ఈసారి కూడా ఉదయం 11 గంటలకే ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండటం చూస్తే.. పదకొండో తేదీ సరిగా అచ్చి రావటం లేదన్న మాట వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కవితను రెండు వేర్వేరు విచారణ సంస్థలు ప్రశ్నలు వేస్తున్నది సెలవు రోజునే కావటం గమనార్హం.

తొలిసారి సీబీఐ ప్రత్యేక టీం కవిత నివాసంలోనే ప్రశ్నలు వేసింది ఆదివారం (డిసెంబరు 11న) అయితే.. తాజాగా విచారణ చేపడుతున్నది  రెండో శనివారం (మార్చి 11న) సెలవు రోజునే కావటం విశేషం. మరి.. ఏ మాత్రం తనకు అచ్చి రాని 11 అంకె రాకుండా చూసుకుంటే మంచిదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News