వార్తల్లో రావటమే కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడుకున్నది లేదు. సవతి తల్లి వేధింపుల తర్వాత సీఎం స్పందించటం.. తాను దత్తత తీసుకున్నట్లుగా చెప్పటమే కాదు.. ఆమె సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పజెప్పారు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ఏ వార్త అయినా.. వాళ్ల నోటి నుంచి వీళ్ల నోటి నుంచి రావటమే తప్పించి.. ప్రత్యూష ఒక్కసారిగా మీడియాతో మాట్లాడలేదు. అలా అని మీడియా సంస్థలు ప్రయత్నం చేయలేదా? అంటే.. చేసినా ఫలితం లేకుండా పోయేది.
తనకు సంబంధించిన ఏ విషయం మీదా మాట్లాడటం ఇష్టం లేదని ఆమె చెప్పేవారు. ఈ రోజు ఆమె వివాహం జరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా ఆమె పెళ్లికుమార్తెను చేసిన సందర్భంగా పలు వార్తలు మీడియాలో వచ్చాయి. కొన్ని నెలల క్రితం ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యూషకు కాబోయే అత్తగారు మీడియాతో మాట్లాడారు కానీ.. ఆమె మాత్రం నో చెప్పేశారు. అలాంటి ప్రత్యూష తొలిసారి ఒక టీవీ చానల్ తో మాట్లాడారు.
సదరు చానల్.. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకమన్న ముద్ర ఉన్నది కావటం గమనార్హం. అలా అని.. ఇందులో కేసీఆర్ దత్త పుత్రికకు సంబంధం లేదనే చెప్పాలి. మిగిలిన వారి కంటే దూకుడుగా వ్యవహరించిన సదరు చానల్ ప్రతినిధి.. ఎట్టకేలకు ప్రత్యూష ముందు మైకు పెట్టటంతో ఆమె మాట్లాడక తప్పలేదన్న మాట వినిపిస్తోంది. తన పెళ్లి గురించి ప్రత్యూష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చరణ్ రెడ్డితో తన పెళ్లి జరగటం చాలా సంతోషంగా ఉందన్న ఆమె.. ఇంతవరకున్న లైఫ్ వేరని.. పెళ్లి తర్వాత కొత్తగా ప్రారంభించే లైఫ్ వేరుగా ఉండనున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. పెళ్లికుమార్తెను చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ స్వయంగా వచ్చి.. పట్టుబట్టలు.. డైమండ్ నెక్లెస్ పెట్టటం సంతోషంగా ఉందన్నారు. తాను సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారన్నారు. ప్రస్తుతం నిమ్స్ లో తాను ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. తనది ప్రేమ వివాహం కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా క్లారిటీ ఇచ్చారు.