`ఆపరేషన్ సౌత్`లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బీజేపీ పెద్దలు నరేంద్ర మోదీ - అమిత్ షా తెలంగాణపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడం - ఆ అవకాశం దక్కకపోతే కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థానం సొంతం చేసుకునేందుకు పార్టీ ముఖ్యులు పెద్ద ఎత్తున్నే ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా - టీఆర్ ఎస్ ను బలహీనపర్చడమే ఉద్దేశంగా బీజేపీ నేతలు నడుచుకుంటున్న నేపథ్యంలో....గులాబీ దళపతి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన, ఆయన తనయుడు కేటీఆర్ చేస్తున్న కామెంట్లు ఇందుకు నిదర్శనం.
తాజా పరిణామం విషయానికి వస్తే...తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారెజ్ లు - పంపు హౌజులకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మేడిగడ్డ బారాజ్ కి లక్ష్మి బారాజ్ గా - కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌజుగా నామకరణం చేశారు. అన్నారం బ్యారేజికి సరస్వతి బారాజ్ గా - సిరిపురం పంప్ హౌజ్ కు సరస్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు. సుందిళ్ల బారాజ్ కు పార్వతి బారాజ్ గా - గోలివాడ పంపుహౌజు కు పార్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు.నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌజుకు నంది పేరు ఖరారు చేశారు. లక్ష్మిపురం పంపుహౌజుకు గాయత్రి పేరు పెట్టారు.
ఇక టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సైతం ఇదే రీతిలో పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. దేశంలో మతం - రాజకీయం - జాతీయవాదం పరస్పరం విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయని - మతాన్ని రాజకీయాన్ని మిళితం చేయడంవల్ల ప్రమాదాలు రాబోతున్నాయన్నారు. నాతో ఉంటే దేశభక్తుడివి.. లేకుంటే నీవు దేశద్రోహివి అనే ధోరణి దేశంలో పెరిగిపోతోందని పరోక్షంగా బీజేపీని కామెంట్ చేశారు. ``పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో భోపాల్ నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ నాథూరాం గాడ్సే గొప్పదేశభక్తుడన్నారు. భారతీయులు ఎవరికైనా కోపం వస్తది. నాకు కూడా కోపం వచ్చింది.. తీవ్రంగా ఖండిస్తూ చాలా తప్పుడుమాట మాట్లాడారని సోషల్ మీడియాలో స్పందించారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపినవారిని దేశభక్తుడని అనడం.. భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇస్తున్నామంటూ బాధతో ట్వీట్‌చేశాను. ఆమె వ్యాఖ్యలను ఖండించిన ట్వీట్ కింద వచ్చిన సమాధానాలు చూసి నాకు ఇంకా బాధనిపించింది. చాలామంది ఆమెను సమర్థిస్తూ మాట్లాడితే.. ఎటుపోతున్నది దేశం.. ఎక్కడున్నాం?`` అని ప్రశ్నించారు.
మరోవైపు ఎంఐఎంతో బహిరంగ దోస్తీకి టీఆర్ ఎస్ ఇష్టపడటం లేదనే చర్చ జరుగుతోంది. ఎంఐఎంతో ఎక్కువ సఖ్యతతో ఉంటే బీజేపీ ఈ విషయాన్ని నెగటివ్‌గా ప్రచారం చేస్తుందనే ఆలోచనతో ఆ పార్టీ పట్ల మునుపటి అభిమానాన్ని చూపడం లేదంటున్నారు. ఇందుకు - ఇటీవల కేటీఆర్- ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సమావేశం రహస్యంగా - మీడియాకు దూరంగా జరగడం నిదర్శనమని అంటున్నారు.