ఈగ ఈగ ఈగ... హత్యకేసులో నిందితుడ్ని పట్టుకోగా...!

అయితే... నిజ జీవితంలో కూడా తాజాగా కొన్ని ఈగలు ఓ హత్యకేసులో పోలీసులకు సహాయం చేశాయి. నిందితుడిని కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించాయి.

Update: 2024-11-06 04:12 GMT

దర్శకధీరుడు రాజమౌళి సినిమా "ఈగ" చాలా మంది చూసే ఉంటారు. మరణించి ఈగ గా మారిన హీరో ప్రియురాలి కోసం ప్రాణాలకు సైతం తెగించి సహాయం చేస్తాడు. అయితే... నిజ జీవితంలో కూడా తాజాగా కొన్ని ఈగలు ఓ హత్యకేసులో పోలీసులకు సహాయం చేశాయి. నిందితుడిని కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించాయి.

అవును... మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ జిల్లాలో పోలీసులకు సహాయం చేశాయి ఈగలు. ఇందులో భాగంగా... ఓ హత్య కేసులో నిందితుడిని పట్తించాయి. విచారణ సమయంలో ఓ వ్యక్తిపై పదే పదే పదే ఈగలు వాలుతున్నాయి.. ఇది గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విషయం బయటకొచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... నిందితుడు తాను ఎంత తెలివైన వాడిని అనుకున్నా, అతడిని పట్టుకోవడానికి పోలీసులకు ప్రకృతి కూడా బాగానే సహకరిస్తుంటుందని చెబుతుంటారు. ఈ సమయంలో తాజాగా ఈగలు సహకరించాయి. అదెలాగంటే...? అక్టోబర్ 30న మనోజ్ ఠాకుర్ (26) అనే వ్యక్తి పని కోసం ఇంటి నుంచి బాలుదేరి వెళ్లాడు. .

అయితే... మరుసటి రోజు ఓ పొలంలో నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో... విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టరు. విచారణ సమయంలో హత్యాస్థలంలో గుంపులో ఉన్న మనోజ్ మేనల్లుడు థరం ఠాకుర్ (19) ని విచారించారు.

ఈ విచారణ సమయంలో అతడి దుస్తులపై ఈగలు వాలడం మొదలుపెట్టాయి. హత్యకేసులో నిందితుడిని పట్టించడానికన్నట్లుగా ఎంత తోలుతున్నా.. అక్కడ అంత మంది ఉన్నా అతడిపైనే వాలుతున్నాయి. దీంతో అదిగమనించిన పోలీసులు తనిఖీ చేయగా.. అతడి ఛాతిపై రక్తపు మరకలు కనిపించాయంట.

అనంతరం అతడి దుస్తులపైనా మృతుడి రక్తపు మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలోనూ నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. అనంతరం... తానే హత్యచేసినట్లు మృతుడు మేనల్లుడు ధరం ఠాకూర్ అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ హత్యకు ముందు చివరిసారిగా మృతుడు, నిందితుడు ఇద్దరూ చికెన్, లిక్కర్ కొన్నట్లు పోలీసులు వెల్లడించారు!

ఏది ఏమైనా... ఈ ఘటనలో నిందితుడిని వీలైనంత త్వరగా గుర్తించడంలో ఈగలు సహాయం చేసినట్లే అని అంటున్నారు. పోలీసు జాగిలాలు చేయాల్సిన పనిని ఈగలు చకచకా చేశాయని చెబుతున్నారు!

Tags:    

Similar News