రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీలకు కొదవ లేదు. ప్రతి శాఖలోనూ ఏదో ఒక లొల్లి రెండు రాష్ట్రాల మధ్య నడుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ ఒకచోట కూర్చొని పరిష్కారాల మీద దృష్టి సారించాలే కానీ.. చాలావరకూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ.. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు సుముఖంగా లేరన్నది తెలిసిందే.
ఇద్దరు ముఖ్యమంత్రుల ఇష్టాయిష్టాలతో పాటు.. పరిస్థితులు కూడా అదే విధంగా ఉండటం చూస్తే..కాసింత విస్మయం కలగక మానదు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లాల్సి ఉంది. కానీ.. ఈసారి ఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కాకుండా.. హకీంపేట లో దిగటం.. దాని పరిధిలో ఏపీ ముఖ్యమంత్రికి సంబంధం లేకపోవటంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవలేని పరిస్థితి.
ఇక.. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఏర్పాటు చేసిన విందునకు అనారోగ్యం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి గైర్హాజరు అయితే..రాష్ట్రపతి ఏర్పాటుచేసిన విందు సమయంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఇక.. గవర్నర్ ఇఫ్తార్ విందునకు ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. తాజాగా ఢిల్లీలో ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి అయోగ్ సమావేశం జరుగుతోంది. ధీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది.
ఈ సందర్భంగా అయితే.. ఈ ఇరువురు చంద్రుళ్లు ఒకరికొకరు ఎదురుపడతారని భావించారు. అయితే..రాజమండ్రిలో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని.. రాజమండ్రిలోనే ఉండిపోతున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పుష్కరాల పనుల్ని సమీక్షించాల్సి ఉన్నందున ఆయన హాజరు కావటం లేదని ప్రధాని కార్యాలయానికి తెలిసారు. ఇలా వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. పరిస్థితులు కూడా ఇద్దరు చంద్రుళ్లను కలిసేలా చేయకపోవటం గమనార్హం.