ఏపీ - తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో నెలకొన్న విభేదాల పరిష్కారానికి అపెక్సు కమిటీ ముందు వాదనలు వినిపించడానికి వెళ్లిన ఏపీ - టీ సీఎంలకు కేంద్ర మంత్రి ఉమాభారతి చేతిలో పువ్వులు పెట్టారు. అవి కూడా వారు తెచ్చినవే వారికి అందించారు. నీరెలా పంచుతారో కానీ... గులాబీలను మాత్రం సమానంగా పంచారు ఉమా భారతి.
చంద్రబాబునాయుడు - కేసీఆర్ లు కృష్ణా జలాల పంపిణీపై అపెక్స్ కమిటీ ముందు వాదనలు వినిపించేందుకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఉమాభారతి వద్దకు వెళ్లిన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉమాభారతికి అభివందనం చేస్తూ కేసీఆర్ గులాబీ పుష్పగుచ్ఛాన్ని ఆమెకు ఇచ్చారు. చిరునవ్వుతో దాన్ని తీసుకున్న ఉమాభారతి - అప్పటికే అక్కడికి చేరుకున్న చంద్రబాబును కేసీఆర్ కు చూపించగా.. ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఆ వెంటనే కేసీఆర్ తనకిచ్చిన గులాబీ బొకే నుంచి ఓ పువ్వును తీసి దాన్ని చంద్రబాబుకు ఇచ్చారామె. ఇంకో పువ్వును తీసి దాన్ని కేసీఆర్ కు ఇచ్చారు. ఏపీ - తెలంగాణ ఇరిగేషన్ మంత్రులు దేవినేని ఉమ - హరీశ్ రావు.. ఇతర అధికారులు ఈ సన్నివేశం చూసి చిరునవ్వులు చిందించారు.
కాగా నీటి పంపకాలు ఎలా ఉన్నా కూడా పువ్వుల పంపిణీలో మాత్రం ఉమాభారతి ఎలాంటి తేడా లేకుండా రెండు రాష్ట్రాలనూ సమానంగా చూశారని అంటున్నారు.