400 రోజుల పాటు సాగే ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను ప్రారంభించారు వైఎస్ షర్మిల. తన తండ్రి సెంటిమెంట్ ను యథాతధంగా ఫాలో అయిన ఆమె.. తన పార్టీ జెండాకు ఉండే రంగున్న చీరను ధరించి పాదయాత్రను షురూ చేశారు. తొలి రోజున కేవలం పది కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేసిన ఆమె.. ప్రారంభంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తండ్రికొడుకులైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్య్రమాల్ని చేపట్టేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ.. నేడు భారీగా అప్పుల పాలైందని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు.
రైతులు.. విద్యార్థులు. .నిరుద్యోగుల ఆత్మహత్యలకు.. హత్యలకు కేసీఆర్.. ఆయన కుటుంబమే కారణమని మండిపడ్డారు. నిత్యం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని పదే పదే చెబుతున్నారని.. అదే నిజమైతే తాన పాదయాత్రకు వెళుతున్నానని.. దమ్ముంటే తనతో పాదయాత్రకు రావాలన్నారు. అప్పుడు మీరు చేసిన అభివృద్ధిని చూపించండి. ప్రజా సమస్యల్ని నేను చూపిస్తా. మీరు చెప్పినట్లుగా తెలంగాణలో ప్రజా సమస్యలే లేకపోతే.. నా ముక్కు నేల రాసి ఇంటికి వెళ్లిపోతానని సవాలు విసిరారు.
తొలిరోజే.. షర్మిల నోటి నుంచి తండ్రీకొడుకులైన కేసీఆర్.. కేటీఆర్ లకు ఘాటు విమర్శలు తప్పలేదు. తెలంగాణలో సమస్యలు ఉన్నట్లుగా నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్.. మంత్రి పదవికి కేటీఆర్ లు రాజీనామా చేస్తారా? అని సూటి ప్రశ్నను సంధించారు. నిత్యం తెలంగాణ అభివృద్ధి గురించి అంత గొప్పగా మాట్లాడే కేసీఆర్.. కేటీఆర్ లు షర్మిల సవాలుకు స్పందిస్తారా? ఆమె వెంట నడిచి డెవలప్ మెంట్ చూపించి.. ఆమెముక్కును నేలకు రాయిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎప్పలానే.. షర్మిల నోటి నుంచి ఎంతటి ఘాటు వ్యాఖ్యలు వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.