తెలంగాణలో ఎక్కడ చూసినా.. ఇదే చర్చ సాగుతోంది. ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. ఏ టీవీ డిబేట్ చూసినా.. ప్రశాంత్ కిశోర్ గురించే జరుగుతుండడం గమనార్హం. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే.. మాటల మాంత్రికుడు. రాజకీయ మేధావి. ఆయన ఎక్కడ వంగాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన రాజకీయ అపర చాణిక్యుడిగా కేసీఆర్ పేరుతెచ్చుకున్నారు. అయితే.. ఆయన ప్రశాంత్ కిశోర్‌కు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని.. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాజకీయంగా ఏ ఇద్దరు నాయకులు కలుసుకున్నా.. ఏ పార్టీ జరిగినా.. ఏ టీవీలో చర్చలు చూసినా.. ఇదే విషయంపై హాట్ హాట్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి కేసీఆర్ రాజకీయ అనుభవం ముందు.. ఆయన మాటల మంత్రాంగం ముందు.. ఆయన చేసే వ్యూహాల ముందు.. ప్రశాంత్ కిశోర్ ఎంత? అనే సందేహం కూడా వస్తుంది. వందమంది ప్రశాంత్ కిశోర్‌లు కలిసినా.. కేసీఆర్ సాటి కారనే వాదన కూడా ఉంది. దీంతో అధికార పార్టీ నేతలు.. ప్రశాంత్ కిశోర్ సేవలు తమకు అవసరం లేదని.. చెబుతుంటారు. అయినప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం ప్రశాంత్ కిశోర్‌కు కేసీఆర్ డబ్బులు ఇచ్చారనే చర్చ మాత్రం కొనసాగుతుండడం గమనార్హం. అది కూడా నేషనల్ మీడియా వరకు పాకింది. అక్కడ కూడా ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
విషయంలోకి వెళ్తే.. కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. జాతీయస్థాయిలో మోడీని వ్యతిరేకించే పార్టీలను ఆయన చేరదీస్తున్నారు. వారితో చర్చలు కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగాలని కేసీఆర్ వ్యూహర చన చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయస్థాయిలో కేసీఆర్‌ను ప్రొజెక్టు చేసేందుకు.. ప్రశాంత్ కిశోర్‌ను ఆయన ఎంచుకున్నారని తెలిసింది. ఎందుకంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్‌కు గట్టి పట్టుంది. అక్కడ ఆయనకు మంచి ఫాలోవర్లు కూడా ఉన్నారు.
దీంతో ప్రశాంత్ కిశోర్ జోక్యం చేసుకుంటే.. తన పని సులువు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నే ప్రశాంత్ కిశోర్‌ను ఆయన పనిగట్టుకుని పిలిపించుకున్నారని అంటున్నారు. అయితే.. కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ప్రొజెక్టు చేసేందుకు ప్రశాంత్ కిశోర్ `నో` చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు.. ``మీ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు 17 మాత్రమే ఉన్నాయి. సో.. జాతీయస్థాయిలో చూసుకుంటే.. పెద్దగా ఈ సంఖ్య పనిచేయదు. సో.. మోడీ వ్యతిరేకించే రాష్ట్రాల్లో.. ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సో.. అక్కడ ఉన్న మమతా బెనర్జీకి మీరు సపోర్టు చేయండి!`` అని ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారట.
దీంతో ఆటోమేటిక్‌గా మీరు కూడా జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని.. ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టు రాజకీయాల్లో చర్చసాగుతోంది. అయితే.. ఈ ప్రతిపాదనకు కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ``జాతీయ స్థాయిలో నేనుఎదగాలని చూస్తే.. నువ్వేమో.. వేరేవాళ్లకు సపోర్టు చేయమని చెబుతున్నావ్.. నీ సలహాలు నాకొద్దులే!`` అని ప్రశాంత్ కిశోర్‌కు కేసీఆర్ మొహం మీదే చెప్పారని సమాచారం. అంతేకాదు.. ప్రశాంత్ ఇచ్చిన సలహాతో చిర్రెత్తుకొచ్చిన కేసీఆర్.. ఆయనపై తీవ్ర ఆగ్రహంతో కూడా ఉన్నారని అంటున్నారు. మరి ఇది మున్ముందు.. ఎలా మారుతుందో చూడాలి. అయితే.. జాతీయస్థాయిలో ఎదగాలని చూస్తున్న కేసీఆర్‌కు ఆదిలోనే ఇలా సలహాలు రావడం ఒకింత ఇబ్బందికరంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.