తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలకు సంబంధించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. ప్రస్తుతం పది జిల్లాలుగా ఉన్న స్థానే.. వాటిని మరో 15 పెంచి పాతిక చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు షురూ చేయటం తెలిసిందే. అయితే.. కొన్ని జిల్లాల ఏర్పాటులో నెలకొన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఈ సంఖ్యను 30 పెంచినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 13 కొత్త జిల్లాల్ని మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన వర్క్ షాపులో ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగినప్పటికీ.. ఒక్క సిరిసిల్లా జిల్లా ఏర్పాటు విషయంలోనే ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికే భద్రాద్రి.. యాదాద్రి జిల్లాలకు ఒక రూపు ఇచ్చిన కేసీఆర్.. సిరిసిల్ల కేంద్రంగా వేములవాడ రాజరాజేశ్వరిస్వామి పేరిట రాజాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలన్నఅంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ జిల్లా ఏర్పాటుపై మరింత కసరత్తు చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో ఈ జిల్లా ఏర్పాటుపై సస్పెన్స్ నెలకొంది. ఇక.. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసినట్లుగా చెబుతున్న 13 జిల్లాల విషయానికి వస్తే..
1. కొమురం భీం (మంచిర్యాల)
2. జగిత్యా
3. భూపాలపల్లి
4. మహబూబాబాద్
5. కామారెడ్డి
6. సిద్దిపేట
7. సంగారెడ్డి
8. సికింద్రాబాద్
9. నాగర్ కర్నూల్
10. వనపర్తి
11. యాదాద్రి
12. సూర్యాపేట
13. భద్రాద్రి