ధనవంతులు గ్రామాల్ని దత్తత తీసుకుని బాగు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆ పిలుపు టైమ్ లోనే యాథృచ్ఛికంగా కొరటాల మనసులో ఊరు-దత్తత కాన్సెప్టు మెదిలింది. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు లోనే శ్రీమంతుడు తెరకెక్కించారు. ఈ సినిమా ఎఫెక్టు ఇటు రాజకీయాలపై సూటిగా పడింది. నేతలంతా ఒకరొకరుగా ఈ సినిమా చూసొస్తున్నారు. బావుంది. ఇన్ స్పయిరింగ్ అంటూ ఊళ్లను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి శ్రీమంతుడు కాన్సెప్టు విపరీతంగా నచ్చేసింది. అందుకే ఈ కాన్సెప్టును అందరిలోకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ప్రతి మంత్రి 5 గ్రామాల్ని దత్తత తీసుకోవాలి. ప్రతి ఎమ్కెల్యే ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేయాలి.. అంటూ ఆయన మంత్రులకు, ఎమ్మెల్యే లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు విధిగా సొంత గ్రామాల్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు.
ఈ ప్రోగ్రామ్ ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం, గంగదేవి పల్లి గ్రామంలో అధికారికంగా లాంచ్ చేస్తున్నారు సీఎం. అంతేకాదు అసలు తెలంగాణలో ఏ గ్రామాల్ని అభివృద్ధి చేయాల్సి ఉంది అన్న జాబితాని పరిశీలిస్తున్నారిప్పుడు. దీనికోసం మండలాధికారులు, సర్పంచుల నుంచి వివరాల్ని కోరుతున్నారు. వార్నీ.. ఎంత ఎఫెక్టు శ్రీమంతుడా? మోడీ ప్లస్ మహేష్ పవర్ ఆ రేంజులో ఉంది మరి