తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్కీం అంటేనే...స్కాం జరుగుతుందనే భయం పట్టుకున్నట్లుందని...గతంలో జరిగిన పలు అవినీతి పర్వాలను చూసి ఈ అభిప్రాయానికి వచ్చారని టీఆర్ఎస్ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతోంది. అవినీతి జలగలు తన ప్రతిష్టాత్మక పథకం...అందులోనూ అన్నదాతలకు అండగా నిలిచే విషయంలో ఇలాంటి ఘనకార్యాలకు పాల్పడితే కష్టమని స్వయంగా కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఇందుకోసం అవినీతిపై ముందస్తు సర్వే చేశారు. ఇదంతా రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8వేల పెట్టుబడి అందించే పథకం గురించి.
గులాబీదళపతి కేసీఆర్ రైతన్నలకు మేలు చేసేందుకు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల చొప్పున వ్యవసాయ పెట్టుబడి అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే..బ్యాంకుల ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తే పథకం విజయవంతం అవుతుందా?కాదా? అనే కోణంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. . ఈ పెట్టుబడిని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవేస్తే.. ఆయా బ్యాంకులు ఆ మొత్తాన్ని పాత అప్పుల కింద జమచేసుకొనే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ సహాయాన్ని నేరుగా రైతులకు అందించే విధంగా వ్యూహరచన చేస్తున్నది.
ఎందుకంటే...పంట రుణమాఫీ విషయంలో బ్యాంకుల తీరుతో రైతులకు పూర్తి ప్రయోజనం కలుగలేదనే భావన ఉంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుచేసినా.. విపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ ప్రతిష్ఠాత్మక పథకంలో బ్యాంకుల ప్రమేయం లేకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. పెట్టుబడిని రైతులకే నగదురూపంలో ఇస్తే అవినీతికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. అధికార యంత్రాంగంలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకొని దళారీ వ్యవస్థ ప్రవేశిస్తుందన్న అనుమానాలున్నాయి. దీంతో మిగిలిన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు.
అందుకే అవినీతిరహిత విధానాన్ని ఎంచుకోవటానికి రాష్ట్రంలోని ఓ గ్రామంలో ప్రయోగాత్మక అధ్యయనం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమచారం. మొబైల్ వ్యాలెట్ ద్వారా కానీ - రూపేకార్డు ద్వారా కానీ ఆ మొత్తాన్ని రైతులకు అందించే దిశలో ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకంలో ఇబ్బందులు రాకూడదని - రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖతో ఒక సర్వే చేయించారు. ఇంతటితో సంతృప్తిచెందని ముఖ్యమంత్రి కేసీఆర్ - రెవెన్యూశాఖ అధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన కూడా చేయించారు. సుమారు కోటీ యాభై లక్షల ఎకరాల వ్యవసాయభూమి సాగులో ఉందని గుర్తించారు. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున అందించటం వలన సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అమలుకావాలని ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నగదు రహిత లావాదేవీల్లో భాగంగా చెక్కు లేదా డీడీ లేదా మొబైల్ వాలెట్ - పేటీఎం - రూపేకార్డు లాంటి ఇతర మార్గాలను పరిశీలిస్తున్నారు. నగదు - చెక్ - డీడీలు అందించే విషయంలో కూడా లంచాలకు ఎక్కువ అవకాశం ఉంటుందనే భావన ఉన్నది. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ లో 100 శాతం నగదురహిత లావాదేవీల స్కీం ఎలా అమలుచేశారో వివరాలు సేకరిస్తున్నారు. ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి - క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టి పథకం అమలులో తలెత్తే ఇబ్బందులను, సాధకబాధకాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. స్థూలంగా తన ప్రతిష్టాత్మక స్కీం..స్కాం కాకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.