మీటింగ్ లో గంటన్నర కంటే ఉండని కేసీఆర్

Update: 2016-07-17 04:43 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ అంటూ మీటింగ్ కి కూర్చున్నారంటే ఎన్ని గంటల పాటు సాగుతుందో ఎవరికి తెలీదు. అధికారులతో ఆయన నిర్వహించే సమీక్షా సమావేశాలు గంటల కొద్దీ సాగుతుంటాయి. ఏ మాత్రం విసుగు.. అసహనం అన్నది లేకుండా హుషారుగా వ్యవహరించే ఆయన తీరుతో.. అధికారులు సైతం గంటల కొద్దీ సాగిన రివ్యూ మీటింగ్ పై సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీ నేతృత్వంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కాసేపు మాత్రమే ఉండగలిగారు.

జ్వరంతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్.. సమావేశానికి హాజరయ్యారు. అయితే.. ఆయన ఎక్కువ సేపు కూర్చోలేకపోయారు. గంటన్నర పాటు సమావేశంలో ఉన్న ఆయన.. ఆ తర్వాత సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. అనంతరం తన అధికారిక నివాసానికి వెళ్లిపోయారు. తాను చేయాల్సిన ప్రసంగాన్ని కార్యదర్శికి ఇచ్చిన ఆయన మీటింగ్ మధ్యలో వెళ్లిపోయారు. గంటల కొద్దీ మారథాన్ మీటింగ్స్ ను అలవోకగా నిర్వహించే కేసీఆర్.. గంటన్నర సేపు కూర్చోలేదంటే.. ఆయనకు జ్వరం తాలుకూ నీరసం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News