అసద్ కుమార్తె పెళ్లికి సీఎం సారు కాన్వాయ్ అంత భారీగానా?

Update: 2020-09-23 05:30 GMT
పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా పలువురి నోట అనిపించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రాధాన్యతలు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుంటాయి. తరచూ బయటకు రావటానికి పెద్దగా ఆసక్తి చూపని ఆయన తరచూ ఫాం హౌస్ లోనే రోజుల తరబడి ఉండిపోతారు. ప్రముఖులు ఎవరైనా కావొచ్చు.. వారింట్లో జరిగే చిన్న ఫంక్షన్ అయినా సరే కేసీఆర్ తనకు తానుగా హాజరవుతారు. అదే సమయంలో ఆయనకు నచ్చకుంటే.. అదెంత పెద్ద ప్రోగ్రాం అయినా.. బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉన్న వారింట్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆసక్తిని చూపించరు.

ఇదంతా ఎందుకంటే? తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహం నిన్న హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జరిగిన సంగతి తెలిసిందే. పరిమిత సంఖ్యలో మాత్రమే పెళ్లి వేడుకను చూసేందుకు ఆహ్వానాలు పంపింది ఓవైసీ కుటుంబం. అంతేకాదు.. పెళ్లికి హాజరయ్యేవారు ఎట్టి పరిస్థితుల్లో ఫోటోలు తీయకూడదని.. వీడియో తీయటాన్ని తాము నిషేధిస్తున్నట్లుగా శుభలేఖలో ప్రత్యేకంగా పేర్కొనటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసద్ ఇంట్లో జరిగిన ఆయన కుమార్తె పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అది కూడా అలా ఇలా కాదు. భారీ కాన్వాయ్ తో అసద్ ఇంటికి చేరుకున్న కేసీఆర్.. కులాసాగా కొద్దిసేపు అక్కడే ఉండిపోయారని చెబుతున్నారు. రోటీన్ కు భిన్నంగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఉందని చెబుతున్నారు. మంత్రులు.. ఇతర ప్రముఖులతో కలిసి కేసీఆర్ కార్యక్రమానికి హాజరైనట్లుగా చెబుతున్నారు. రెగ్యులర్ గా సీఎం కాన్వాయ్ లో ఉండే వాహనాలకు రెండింతలకు పైనే అసద్ ఇంట జరిగిన వివాహాం కోసం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఏమైనా అసద్ ఇంట జరిగిన పెళ్లికి వెళ్లిన కేసీఆర్.. తన భారీ కాన్వాయ్ తో నిండుతనాన్ని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News