ఎన్నికలు అందరికీ లాభాన్ని తెచ్చేవే. ఏ వృత్తిలో ఉన్నవారికైన ఎన్నికలు కాసుల వర్షం కురిపిస్తాయి. దీనికి జ్యోతిషం కూడా మినహాయింపు కాదు. దేశవ్యాప్తంగా ప్రజలందురూ జ్యోతిష్యం వైపు పరుగులు తీస్తున్నారు. గతంలో కంటే ఈ శాస్త్రానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. గతంలో మధ్యతరగతి ప్రజలు - ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు జ్యోతిష్యం చెప్పించుకునేవారు. ఇప్పుడు అన్ని వర్గాలవారు - ధనవంతులు కూడా ఈ శాస్త్రంపై మక్కువ పెంచుకుంటున్నారు. ఏ సమయంలో ప్రయాణించాలి - తన తారను బట్టి ఎప్పుడు ముహూర్తం నిర్ణయించుకోవాలి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక రాజకీయ నాయకులైతే ముహూర్త బలం లేకుండా అడుగు ముందుకు వేయటం లేదు. దీనికి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావే తార్కాణం.
తన చివరి మంత్రి వర్గ సమావేశం ఏ సమయంలో జరగాలి, గవర్నర్ ను కలసి ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని ఏ సమయంలో చెప్పాలి వంటి విషయాలకు కూడా ముహుర్తాలను కుటుంబ జ్యోతిషుల చేత పెట్టించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రథి రాజకీయ నాయకుడికి తమ వ్యక్తిగత జ్యోతిషుడు ఉండనే ఉన్నారు. వీరి ఆదేశాల మేరకు - వీరు నిర్ణయించిన ముహుర్తాల మేరకు వారంతా కార్యక్రమాలు చేపడతారు. ముందస్తు ప్రకటన రావడం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతోనే తెలంగాణలో జ్యోతిషుల హవా పెరిగింది. రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత జ్యోతిషుల ఇళ్లకు క్యూ కడుతున్నారు. తమకు టికెట్ ఇవ్వాలంటూ అధినేతను ఏ సమయంలో కోరాలి, అధిష్టానాన్ని కలిసేందుకు ఏ సమయం మంచిది వంటి నిర్ణయాలకు కూడా జ్యోతిషులపైనే ఆధారపడుతున్నారు.
టికెట్ వచ్చిన తర్వాత బీ-ఫారమ్ ఎప్పుడు తీసుకోవాలి, నామినేషన్ ఏ సమయంలో వేయాలి వంటి పనులకు కూడా జ్యోతిషుల పైనే ఆధారపడుతున్నారు. జ్యోతిషులు కూడా నొప్పింపక తానొవ్వక అన్నట్లు గానే వ్యవహరిస్తున్నారు. ముహూర్త బలాన్ని బట్టి గెలపోటములు నిర్ణయించలేమని, ప్రజల ఆదరణ ఉండాలని రాజకీయ నాయకులకు తెలిసినా భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందకూడదని జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. జ్యోతిషం కూడా అన్ని శాస్త్రాల వలె ఓ శాస్త్రం అని ప్రజలు గుర్తించడంతో దీనికి ఆదరణ పెరుగుతోంది. మంత్రాలకు అన్ని చింతకాయలు రాలకపోయినా...వీచే గాలి వల్ల ఒకటి రెండు చింతకాయలైన పడతాయని రాజకీయ నాయకుల నమ్మకం. ఏమో అన్నీ అనుకూలిస్తే ...... ఏమో గర్రం ఎగరావచ్చు....ఆ రాజకీయ నాయకులు దానిని స్వారీ చేయావచ్చు....!