తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు పాలిటిక్స్ ప్రభావితం అయ్యేలా తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొద్దిరోజుల వరకు కేవలం బీజేపీపై మాత్రమే విరుచుకుపడిన కేసీఆర్ తాజాగా... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్ల నేపథ్యంలో మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే చర్చ మొదలైంది. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కు కేసీఆర్ దగ్గర అవుతున్నారనే ఊహలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్‌ను నమ్మే అవకాశం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ రెండు సార్లు నమ్మి మోసపోయిందని.. మళ్లీ కేసీఆర్‌ని నమ్మి మోసపోం అన్నారు.
మోసగాడికి బ్రాండ్ అంబసిడర్ కేసీఆర్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ తమకు సమాన దూరం అని పేర్కొన్న రేవంత్ రెడ్డి మా ఇంటి కాకి కేసీఆర్ ఇంటి మీద వాలదు.. వాలింది అంటే కాల్చి పడేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సందర్భంలో జేపీ, టీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నాయన్న ఆరోపించారు. ఒకరి దొంగ తనం ఒకరి దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు...ఎవరైనా బయట పెట్టారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అవినీతి బయట పెడతా అంటే ఎవరు వద్దని అన్నారు? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
రఫెల్ మీద మేం మాట్లాడినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లడలేదని నిలదీసిన ఆయన.. ఇద్దరూ తోడు దొంగలు.. ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుని బతకాలని చూస్తున్నారని ఆరోపించారు.