పీవీకి భారతరత్నఇవ్వాలి..కేసీఆర్ తీర్మానం

Update: 2020-08-28 17:33 GMT
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్ మరో అరుదైన గౌరవాన్ని ఇవ్వాలని తీర్మానించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పీవీకి ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ‘పీవీ’కి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు.

అలాగే హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మాణం చేపడుతామని.. పీవీ నరసింహరావు గొప్ప సంస్కర్త అని ప్రపంచం గుర్తించిన తెలంగాణ బిడ్డ అని కేసీఆర్ ప్రశంసించారు.

పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ పుట్టిన లక్నెపల్లి , పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి పీవీ పేరు.. పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు.. పీవీ విగ్రహాలను ఢిల్లీ తెలంగాణ భవన్ లో పెట్టడం.. ఇలా పీవీని నెత్తిన పెట్టుకున్నాడు కేసీఆర్.
Tags:    

Similar News