ఎనిమిదేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న మోడీ సర్కారు జైత్రయాత్రకు చెక్ పడే పరిస్థితులు ఏర్పడ్డాయా? ఈ దేశానికి బీజేపీ మినహా మరే రాజకీయ పార్టీ లేదన్న భావన అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. సరికొత్త విమర్శలు.. అంతకు మించి అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా తమ మీద తల ఎగరేసే వారిని.. ఊహించని రీతిలో దెబ్బేయటం మోడీ సర్కారుకు వచ్చినంత బాగా మరెవరికీ చేతకాదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా అందుకు భిన్నమైన అనుభవాన్ని మోడీ పరివారానికి చూపించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు తాము టార్గెట్ చేసిన రాష్ట్రం ఏదైనా సరే.. పాలకుల నుంచి కీలక అధికారుల వరకు విచిత్రమైన సాకులతో దూకేయటం.. అనూహ్యంగా ఈడీ.. సీబీఐ లాంటి విభాగాల్ని ఉసిగొల్పి.. సదరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కరి చేసే ఆట ఆడటం మోడీషాలకు అలవాటే.
తాజాగా మాత్రం ఆట మొత్తం మారిపోయింది. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని చెప్పక తప్పదు. ఇంతకాలం మోడీషాలు ఏదైతే పద్దతిని ఫాలో అయ్యారో.. సరిగ్గా ఇప్పుడు అదే విధానాన్ని కాస్తంత మొరటుగా అమలు చేస్తున్నారు కేసీఆర్.
ప్రధాని మోడీతో పాటు నెంబరు టూ స్థానంలో ఉన్న అమిత్ షా వద్దనే జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన వివరాల్ని కేసీఆర్ ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారా? ఢిల్లీ స్థాయిలో ఏం జరుగుతుందన్న విషయంపై గులాబీ బాస్ ఒక కన్నేసి ఉంచారా? అన్న సందేహాన్ని కలిగించేలా కేసీఆర్ మాటలు ఉన్నాయని చెప్పాలి.
కేంద్రం మీద విమర్శలు పెద్ద ఎత్తున మీద పడే అవకాశం ఉన్న వేళలో.. అలాంటి పనే చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న దానిపై కేసీఆర్ కు మస్తు క్లారిటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఎదురుదాడికి దిగితే.. మోడీ సర్కారు ఇరుకున పడేందుకు వీలుగా కేసీఆర్ మాటలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు కాదు కానీ.. వారం.. పది రోజుల తర్వాత తన మాటలకు బదులు తీర్చుకునే కార్యక్రమానికి కేసీఆర్ తెర తీశారని చెప్పాలి. తనను దెబ్బ తీసే కార్యక్రమాన్నిషురూ చేస్తే.. ఆ వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చేర్పులకు అవకాశం ఉందని చెప్పక తప్పదు.