తెలంగాణలో బీఆర్ఎస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన పథకం 'రైతుబంధు' అని చెప్పుకుంటున్నారు. పెట్టుబడి సాయం కింది ప్రతీ ఏడాదికి రైతుకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేస్తోంది. అయితే పరిమితి లేకుండా లక్షల ఎకరాలున్న వారికీ ఈ సాయం అందుతోంది. దీంతో కొంతమంది భూ స్వామిదారులకు పథకం ప్రయోజనకరంగా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య ఓ మంత్రి ఏడాదికి రూ.కోటి 20 లక్షలు రైతు బంధు వస్తున్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు.
దీంతో రైతుబంధు బీఆర్ఎస్ లీడర్లు, ఉన్న వర్గానికి చెందినవారిదే అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 15 ఎకరాల వరకే రైతు బంధు అందినట్లు సమాచారం. మిగతా వారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
'రైతు బంధు' సాయం పరిమితి లేకుండా తెలంగాన ప్రభుత్వం ఇస్తోంది. దీంతో వందల ఎకరాలు ఉన్న వారికి లక్షల రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. దీంతో చాలా మంది డబ్బున్న వారు మారుమూల ప్రాంతాల్లో భూములు కొనుగులో చేసి రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. సాగు చేయకున్నా రైతు బంధు సాయం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం రైతు పెట్టుబడిగా రూ.2 వేలు అందిస్తోంది. అయితే 5 ఎకరాల లోపు ఉన్నవారికే పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో 5 ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
తాజాగా 15 ఎకరాల లోపు ఉన్నవారికే రైతుబంధు డబ్బులు పడ్డాయి. అంతకంటే ఎక్కువ ఉన్నవారు తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఎంక్వైరీలు చేస్తున్నారు. రైతుబంధు కోసం చిన్న రైతులు కాకుండా బడాబాబులే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు, అధికారులు సైతం ఎకరాల కొద్దీ భూములు కొన్న వారికి ప్రతీ ఏటా కోట్ల రూపాయలు అప్పనంగా ఖాతాల్లో పడుతున్నాయి. కానీ ఈసారి రాకపోయేసరికి వారిలో ఆందోళన నెలకొంది. దీంతో కేసీఆర్ 15 ఎకరాలకే పరిమితం చేశారా? అన్న చర్చ సాగుతోంది.
అయితే పరిమితి విధిస్తే కేసీఆర్ ముందే ప్రకటించేవారని అంటున్నారు. ప్రభుత్వం ఖాజానాలో నిధులు లేకపోవడంతో రైతుబంధు డబ్బుులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే 10 ఎకరాల లోపు ఉన్నవారికి రైతుబంధు వేయకపోతే తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అందుకే 15 ఎకరాల వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పైన ఉన్నవారు రైతుబంధు వచ్చినా, రాకపోయినా పెద్దగా అడిగే ప్రసక్తి ఉండదని, అదుకే అక్కడికే కటాఫ్ చేశారని అంటున్నారు.
కానీ సాగు చేయకున్నా రైతుబంధు డబ్బులు పొందేవారు మాత్రం ఈసారి డబ్బులు పడకపోయేసరికి ఆందోళన వ్యక్తమవుతోంది. కొంత మంది పట్టణాల్లో, నగరాల్లో ప్లాట్లను అమ్మి మరీ వ్యవసాయ భూములు కొన్నారు. మరికొందరు అప్పులు చేసి కొనుగోలు చేశారు. ఈ తరుణంలో రైతుబంధు 15 ఎకరాలకు పరిమితి చేస్తే వారి పరిస్థితి అయోమయంగా మారనుంది. రైతుబంధు పై పెట్టుకున్న ఆశలు అడియాశలవుతాయిన అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.