ప్రాణాంతక వైరస్ కరోనాపై సాగిస్తున్న పోరులో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం గణనీయమైన ఫలితాలనే సాధించినట్టైందని చెప్పక తప్పదు. ఎందుకంటే... కరోనా బారిన పడిన 70 మందిలో ఆదివారం ఒక్కరోజే... ఏకంగా 11 మంది కోలుకున్నారు. పాజిటివ్ గా తేలిన ఈ 11 మందికి ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షల్లో ఈ 11 మందికి నెగెటివ్ అని వచ్చింది. దీంతో తెలంగాణ సర్కారులో.. కరోనాను పారదోలేస్తామన్న ధీమా స్పష్టంగా కనిపించింది. ఇదే విషయం ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ముఖంలో చాలా స్పష్టంగానే కనిపించింది. ఆదివారం కరోనా నుంచి కోలుకున్న వారిని సోమవారం డిశ్చార్జీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. వచ్చే నెల 7 నాటికి రాష్ట్రంలో మిగిలిన పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్ గా మారతాయని - మొత్తంగా ఏప్రిల్ 7 తర్వాత రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బాధితులు ఉండరని కూడా కేసీఆర్ ధీమాగా చెప్పారు.
మీడియా సమావేశంలో ఇంకా కేసీఆర్ ఏమన్నారంటే... ‘‘తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70. ఒక వ్యక్తి డిశ్చార్జీ అయ్యాడు. కరోనా బాధితుల్లో 11 మందికి నెగెటివ్ రావడం శుభవార్తగా భావిస్తున్నాం. ఇక మన వద్ద 58 మంది బాధితులు ఉంటారు. వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి కోలుకున్నవారిని డిశ్చార్జి చేస్తాం. 25,937 మందిపై నిఘా ఉంది. వారిలో 14 రోజుల పరిశీలన పూర్తయిన వారిలో కరోనా లక్షణాలేవీ లేకపోతే పంపించివేస్తాం. మార్చి 30 నాటికి 1899 మందిని - మార్చి 31 నాటికి 1450 మందిని... ఇలా దశలవారీగా లక్షణాలు లేనివారిని పంపించేస్తాం’’ అని కేసీఆర్ వెల్లడించారు.
‘‘అంతర్జాతీయ విమానాశ్రయాలు - పోర్టులు మూతపడడంతో బయటి దేశాల నుంచి కరోనా బాధితులు వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో ఉన్న వారికి నయం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా చూడడమే ప్రాధాన్య అంశం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు లేవు అందుకే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్ డౌన్ ను ప్రయోగించడం. ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయంగా అందరూ అభినందిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఒక్క కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి 59 వేల మందికి సోకినట్టు గుర్తించారు. పాపం ఆ వ్యక్తికి తనకు కరోనా సోకినట్టు కూడా తెలియని అమాయకుడు. ఒక్క సూది మొన పైన కోట్ల సంఖ్యలో కరోనా క్రిములు ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. కరోనా క్రిమి చిన్నదైనా చాలా పదునైనది మనం జాగ్రత్తగా ఉండడమే ముఖ్యం’’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఒకేరోజు 11 మందికి పాజిటివ్ రోగులకు నెగెటివ్ అని రావడంతో కరోనాను సమూలంగా పారదోలతామని కేసీఆర్ లో స్పష్టమైన ధీమా కనిపించిందని చెప్పాలి.